బీజేపీ పై మండిపడుతున్న రాహుల్ గాంధీ.. ఎందుకంటే.. ?

కేంద్రం పై ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేస్తుండగా, తాజాగా కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ పై మండిపడుతున్నారు.పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఉత్తర్ దినాజ్‌పూర్‌లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నా సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.

 Rahul Gandhi Fires On Bjp, North Dinajpur, Rahul Gandhi, Bjp, Furious-TeluguStop.com

పదే పదే ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అని పిలుపునిచ్చే బీజేపీ ‘తృణమూల్ ముక్త్ భారత్’ అని ఎప్పుడూ అనలేదేం అంటూ ప్రశ్నించారు.

కాగా మమతా, బీజేపీ మాజీ మిత్రులని, అందుకే ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ పోరే గానీ సిద్ధాంత పరంగా ఒకటేనని విమర్శించారు.

ఇకపోతే బెంగాల్‌లో మమతా బెనర్జీ రోడ్లు నిర్మించారా, కాలేజీలు కట్టారా, చివరికి విద్యార్థులకు ఉద్యోగాలు లేవు.ఉద్యోగం రావాలంటే లంచాలు ఇచ్చుకోవాల్సిందని ఎద్దేవా చేస్తూ, మీరు టీఎంసీకి రెండు సార్లు అవకాశమిచ్చిన మీ అంచనాలను అందుకోవడంలో టీఎంసీ దారుణంగా విఫలమైందని, ఈ పదేళ్లలో మమతా బెనర్జీ బెంగాల్‌కు చేసింది ఏమీ లేదని ఆరోపించారు.

ఇక బీజేపీ పై మండిపడుతూ కరోనా కట్టడి లో ప్రధాని దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు రాహుల్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube