సూట్ కేస్ ఫ్రేమ్ లో బంగారం.. దేశాలు తిరిగి హైదరాబాద్ లో పట్టుబడ్డారు..!

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బుధవారం 381 గ్రాముల బంగారం అక్రమ రవాణా చేస్తుండగా ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు వాటిని ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణీకుడు సూట్ కేస్ కు ప్రత్యేకంగా సెపరేట్ ఫ్రేమ్ ఏర్పరచారు.

 Gold Seized In Shamshabad Airport , Airport, Dubai, Customs Officers, Suit Case,-TeluguStop.com

దానిలో బంగారాన్ని దాచి పెట్టారు.ఆ సూట్ కేస్ చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు అందులో బంగారం ఉందని కనిపెట్టారు.దాదాపు 400 గ్రాముల దాకా ఆ బంగారం ఉంటుందని దాని విలువ 13.6 లక్షల దాకా ఉంటుందని చెబుతున్నారు.

అయితే ఆ బంగారం ఎక్కడ నుండి తెస్తున్నారు.ఇక్కడ ఎవరికి ఇస్తారు అన్న దాని మీద ఆ ప్రయాణీకుడిపై కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.సూట్ కేస్ ఫ్రేం లో ఎవరు గుర్తించకుండా బంగారాన్ని అక్రమంగా రావాణా చేస్తున్నాడు సదరు వ్యక్తి.అయితే దుబాయ్ మాత్రమే కాదు అతను తిరిగిన దేశాల లిస్ట్ చాలా పెద్దదే అని తెలుస్తుంది.

దేశాలు తిరిగి వచ్చి చివరకు హైదరాబాద్ లో కస్టమ్స్ వారికి దొరికిపోయాడు.ఇంతకీ అసలు ఆ బంగారం ఎక్కడ నుండి తెస్తున్నారు.

అతను గురించి పూర్తి డీటైల్స్ విచారణలో రాబడుతున్నారు.బంగారం అక్రమ రవాణా కేసులు ఈమధ్య బాగా ఎక్కువవుతున్నాయి.

వివిధ రకాలుగా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ కస్టమ్స్ వారికి దొరికిపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube