తిరుపతి బాబు సభ పై రాళ్ల దాడికి సంబంధించి డీఐజి కీలక ప్రకటన..!!

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు సభ పై రాళ్ల దాడి జరిగినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.రాళ్ల దాడి జరిగిందని పార్టీ నాయకులతో కలసి రోడ్డుపై బైఠాయించి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.

 Dig's Key Statement Regarding Stone Pelting On Tirupati , Babu Sabha Tirupathi,-TeluguStop.com

ఇదంతా వైసీపీ ప్రభుత్వం యొక్క చర్య అంటూ పోలీస్ వ్యవస్థ వైఫల్యం అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో అదే టైంలో మండిపడ్డారు.ఇదిలా ఉంటే టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు రాళ్ల దాడిలో గాయపడిన వారిని మరియు చంద్రబాబు భద్రత సిబ్బందిని విచారించడం జరిగింది.

విచారణ అనంతరం డీఐజి క్రాంతి రాణా కీలక ప్రకటన చేశారు.ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

ఈ క్రమంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులను విచారించడంతో పాటు ఇద్దరిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశామన్నారు.స్థానిక సీసీ, మొబైల్, మీడియా పుటేజ్ లను కూడా పరిశీలించామని చెప్పారు.

అయితే ఈ క్రమంలో రాళ్లువిసిరిన నాకు ఎక్కడా ఆధారాలు లభించలేదని, సభకు ఎటువంటి ఆటంకం కలగలేదని చంద్రబాబు సభ అయిపోయిన తర్వాత తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు.రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని, మా పై మా వ్యవస్థపై రాజకీయ నేతలు ఆరోపణలు చేయడం అంత మంచిది కాదు అంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలను డీఐజి తీవ్రంగా ఖండించారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube