ఉగాది కానుకగా సరికొత్త పోస్టర్ ను విడుదల చేసిన విరాటపర్వం చిత్ర యూనిట్..!

తాజాగా సాయిపల్లవి దగ్గుబాటి రానా హీరోహీరోయిన్లుగా జంటగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం.వేణు కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

 Virataparvam Movie Unit Has Released The Latest Poster As A Gift For Ugadi , Vir-TeluguStop.com

ఈ సినిమాని ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు ఊపందుకున్నాయి.ఈ సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర, నందితాదాస్, ఈశ్వరీరావు, నివేద పేతురాజ్ లాంటి తదితరులు తారాగణం ఈ చిత్రంలో సందడి చేయబోతున్నారు.

ఈ సినిమా పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన నక్సల్స్ కు సంబంధించిన కథ సారాంశంతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా విప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా విరాట పర్వం చిత్రం నుండి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ పోస్టర్ లో సాయి పల్లవి ఎంతో అందంగా కనబడుతోంది.గడపకు పసుపు రాస్తున్న ఈ పోస్టర్ తో ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ విరాటపర్వం సినిమా చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.

నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం విడుదలకు అన్ని హంగులను జోడించుకొని రెడీ .
అవుతోంది.

రానా దగ్గుబాటి ఇటీవలే అరణ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే కరోనా కారణంగా సినిమా విడుదల ఆలస్యం కావడంతో అతి తక్కువ వ్యవధిలోనే హీరో రానా దగ్గుబాటి మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు.వైవిధ్య పాత్రలను పోషించే రానా దగ్గుబాటి ఈసారి నక్సలైట్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైపోయారు.ఇక క్యారెక్టర్ లో కంటెంట్ ఉంటేనే నటించే సాయి పల్లవి ఈ సినిమాకి మరింత ప్లస్ కాబోతోంది.

ఇక వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉందో తెలియాలంటే ఏప్రిల్ 30 వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube