వైరల్ వీడియో: వింత యాక్షన్ బౌలింగ్ తో అదరగొట్టిన రాజస్థాన్ ఆటగాడు..!

ఈ మధ్య కాలంలో కొంత మంది క్రికెటర్స్ క్రికెట్ లో ఉన్న నిబంధనలను వారికి అనుకూలంగా చేసుకొని కొత్త యాక్షన్ బౌలింగ్ లతో బ్యాట్స్ మెన్స్ ను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు.కొందరు వెరైటీ యాక్షన్ బోలింగ్ వేస్తే మరికొందరు అప్పటికప్పుడు వారి యాక్షన్ బౌలింగ్ మార్చుకొని బ్యాట్స్మెన్స్ ను అయోమయానికి గురి చేస్తున్నారు.

 Viral Video Rajasthan Royals Bowler Riyan Parag Unique Bowling Action , Viral ,-TeluguStop.com

తాజాగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ రియాన్ పరాగ్ బౌలింగ్ యాక్షన్ ప్రస్తుతం ఐపీఎల్ లో ఓ హాట్ టాపిక్ గా మారింది.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్ రియాన్ పరాగ్ కొత్త ఎత్తుగడ వేసి తనదైన శైలి లో బౌలింగ్ వేసి పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ను రియాన్ పరాగ్ అయోమయానికి గురి చేసి మొత్తానికి వికెట్ తీసుకున్నాడు.

ఇకపోతే బౌలర్ తన శరీరానికి చేతిని 90 డిగ్రీల కోణంలో తిప్పుతూ విసరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.ఈ యాక్షన్ బౌలింగ్ చూడడానికి అటు అభిమానులు ఇటు ఐపీఎల్ నిర్వాహకులకు కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ యాక్షన్ బౌలింగ్ కు సోషల్ మీడియాలో పెద్దఎత్తున కామెంట్ల వర్షం కురుస్తోంది.

ఇకపోతే కొందరు నెటిజెన్స్ ఈ రైట్-ఆర్మ్ బౌలింగ్ కి మీరు ఏం పెడతారు అని ఐపీఎల్ తన సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ను ప్రశ్నించింది.అయితే ఈ మ్యాచ్ లో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసిన పరాగ్ గేల్ వికెట్ తీయడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే.రియాన్ పరాగ్ ఒక్క ఓవర్ మాత్రమే వేసిన మొదట బాల్ నుంచి తప్పించుకున్న గేల్ చివరికి అదే ఓవర్లో రియాన్ పరాగ్ బౌలింగ్ లో బోల్తా పడ్డాడు.

గేల్ ను అవుట్ చేయడంతో సోషల్ మీడియాలో రియాన్ పరాగ్ పై పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురుస్తుంది.ఒక అతడి బౌలింగ్ చాలా వెరైటీ గా ఉందని కొందరు కామెంట్ పెడుతుంటే.

ఇదేం బౌలింగ్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube