ఎన్టీఆర్ కొరటాల మూవీలో హీరోయిన్ ఆమేనంట..?

గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విధంగానే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ ఆగిపోయింది.ఈ సినిమా ఆగిపోవడానికి వేర్వేరు కారణాలు వినిపిస్తున్నా ఎన్టీఆర్ లేదా త్రివిక్రమ్ స్పందించి వివరణ ఇస్తే మాత్రమే సినిమా ఆగిపోవడానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 Junior Ntr Koratala Shiva Movie Heroine Details,latets Movie News,viral-TeluguStop.com

ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనుండగా ఈ సినిమాకు హీరోయిన్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్నట్టు సమాచారం.

కొరటాల శివ దర్శకత్వం వహించిన భరత్ అనే నేను సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

కొరటాల శివ ఆ హీరోయిన్ నే మళ్లీ రిపీట్ చేయబోతున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం కియారా పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండగా ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా కోసం బాలీవుడ్ విలన్ ను తీసుకోబోతున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ జూన్ నెల మూడవ వారం నుంచి కొరటాల శివ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం.2022 ఏప్రిల్ నెల 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.అరవింద సమేత సినిమా తరువాత మూడేళ్ల గ్యాప్ రావడంతో ఎన్టీఆర్ ఇకపై వేగంగా సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో భవిష్యత్తులో మరో సినిమా తెరకెక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.ఎన్టీఆర్ తరువాత సినిమా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube