సాగర్ ఎన్నిక ప్రచారంలో బీజేపీ విమర్శలను ప్రజలు లైట్ తీసుకుంటున్నారా?

ఏమీ లేని విస్తారాకు ఎగిరెగిరి పడుతుందనే సామెత ప్రస్తుత పరిస్థితులలో బీజేపీకి కరెక్ట్ గా సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు ప్రగాఢంగా అభిప్రాయపడుతున్నారు.ఎటువంటి విమర్శలకైనా ఓ హద్దు, అదుపు ఉంటుంది.

 Bjp Bandi Sanjay Statements In Nagarjuna Sagar Elections, Nagarjuna Sagar Elect-TeluguStop.com

సహేతుక విమర్శలను ఎవరైనా స్వాగతిస్తారు.అవే విమర్శలు శృతి మించితే ప్రజలు హర్షించరే విషయాన్ని ఈ రాజకీయ నాయకులు చాలా ఆలస్యంగా గుర్తిస్తారు.

బీజేపీ టీఆర్ఎస్ పై విమర్శలు చేసినట్టు వేరే ఏ పార్టీ కూడా చేయలేదు.టీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పు ఉండొచ్చు కాక, కాని పరుష పదజాలంతో బహిరంగ సభలో మాట్లాడడం భావ్యం కాదనే విషయాన్ని బీజేపీ గుర్తేరాగాల్సిన అవసరం ఉంది.

ఇప్పుడు ఇదే వైఖరి బీజేపీ కొంప ముంచిందనే చెప్పవచ్చు.ప్రజలు బీజేపీ విషయంలో ఎటువంటి నిర్ణయానికి వచ్చారంటే ప్రభుత్వాన్ని తిట్టడమే వీరి పనిలా ఉందని, విమర్శలు అవసరం లేని చోట కూడా విమర్శిస్తూ ప్రజల్లో పలుచబడ్డారని చెప్పవచ్చు.

అందుకే నాగార్జున సాగర్ లో బీజేపీని అసలు పరిగణలోకి తీసుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే బండి సంజయ్ విమర్శలకు ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించడం లేదట.

దీంతో ఇప్పుడు బీజేపీ నేతలు ఆలోచనలో పడ్డారని, ఈ ఎన్నిక వరకు కాక తెలంగాణలో బీజేపీ మనుగడకే ప్రమాదం పొంచి ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube