ఆస్తమా.దీనినే ఉబ్బసం అని కూడా అంటారు.ఇదో శ్వాస సంబంధ రుగ్మత. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తుంది.ఆహారపు అలవాట్లు, వాతావరణం మార్పులు, ధూమపానం, మద్యపానం, వాయు కాలుష్యం ఇలా రకరకాల కారణాల వల్ల ఆస్తమా వ్యాధి బారిన పడు తుంటారు.కొందరికి వంశపారంపర్యంగా కూడా ఆస్తమా వస్తుంది.
దీర్ఘకాలిక వ్యాధి అయిన ఆస్తమా.ఒక్క సారి వచ్చిందంటే జీవిత కాలం మనిషిని పీల్చి పిప్పి చేసేస్తుంది.
అందుకే ఆస్తమా అంటేనే భయపడుతుంటారు.అయితే కొందరు తమకు ఆస్తమా ఉందని కూడా గుర్తించలేరు.
దీంతో సమస్య మరింత తీవ్రం అవుతుంటుంది.అయితే కొన్ని కొన్ని లక్షణాల బట్టీ ఆస్తమాను గుర్తించవచ్చు.
మరి ఆ లక్షణాలు ఏంటీ అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఆస్తమా ప్రధాన లక్షణాల్లో దగ్గు ఒకటి.
దగ్గు తరచూ వస్తూనే ఉంటుంది.ఎన్ని మందులు, టానిక్కులు వాడినా దగ్గు తగ్గడం లేదూ అంటే ఆస్తమా అని అనుమానపడాల్సిందే.
అలాగే ఛాతి నొప్పిగా ఉండటం కూడా ఆస్తమా లక్షణం.తరచూ ఛాతిలో నొప్పి పుడుతూ ఉంటే.ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.ఆస్తమా ఉంటే.ఊపిరి ఆడక పోవడం, శ్వాస సరిగ్గా అందకపోవడం జరుగుతుంది.ఇలా అనిపించినా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.ఆస్తమా వస్తే.ఏ పని చేయక పోయినా తరచూ ఆయాస పడి పోతుంటారు.ఇక గురక, పిల్లి కూతలు వంటి లక్షణాలు కనిపించినా.ఆస్తమా అని భయపడాల్సిందే.
ఇక ఆస్తమా వ్యాధి ఉన్న వారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.పోషకాహారం తీసుకోవాలి.
దుమ్ముకు, ధూళికి దూరంగా ఉండాలి.ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటిని డైట్లో నుంచి కట్ చేయాలి.
పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి.మద్యపానం, ధూమపానం అలవాట్లు ఉంటే మానుకోవాలి.