ఈ ల‌క్ష‌ణాలు ఉంటే మీకు ఆస్త‌మా ఉన్న‌ట్టే..జాగ్ర‌త్త‌!

ఆస్త‌మా.దీనినే ఉబ్బ‌సం అని కూడా అంటారు.ఇదో శ్వాస సంబంధ రుగ్మత.  పిల్ల‌లు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మందిలో ఈ స‌మ‌స్య క‌నిపిస్తుంది.ఆహార‌పు అల‌వాట్లు, వాతావ‌ర‌ణం మార్పులు, ధూమపానం, మద్యపానం, వాయు కాలుష్యం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఆస్త‌మా వ్యాధి బారిన ప‌డు తుంటారు.కొంద‌రికి వంశపారంపర్యంగా కూడా ఆస్త‌మా వ‌స్తుంది.

 What Are The Symptoms Of Asthma! Symptoms Of Asthma, Symptoms, Asthma, Health Ti-TeluguStop.com

దీర్ఘ‌కాలిక వ్యాధి అయిన ఆస్త‌మా.ఒక్క సారి వ‌చ్చిందంటే జీవిత కాలం మ‌నిషిని పీల్చి పిప్పి చేసేస్తుంది.

అందుకే ఆస్త‌మా అంటేనే భ‌య‌ప‌డుతుంటారు.అయితే కొంద‌రు త‌మకు ఆస్త‌మా ఉంద‌ని కూడా గుర్తించ‌లేరు.

దీంతో స‌మ‌స్య మ‌రింత తీవ్రం అవుతుంటుంది.అయితే కొన్ని కొన్ని ల‌క్ష‌ణాల బ‌ట్టీ ఆస్త‌మాను గుర్తించ‌వ‌చ్చు.

మ‌రి ఆ ల‌క్ష‌ణాలు ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఆస్త‌మా ప్ర‌ధాన ల‌క్ష‌ణాల్లో ద‌గ్గు ఒక‌టి.

ద‌గ్గు త‌ర‌చూ వ‌స్తూనే ఉంటుంది.ఎన్ని మందులు, టానిక్కులు వాడినా ద‌గ్గు త‌గ్గ‌డం లేదూ అంటే ఆస్త‌మా అని అనుమాన‌ప‌డాల్సిందే.

అలాగే ఛాతి నొప్పిగా ఉండ‌టం కూడా ఆస్త‌మా ల‌క్షణం.త‌ర‌చూ ఛాతిలో నొప్పి పుడుతూ ఉంటే.ఖ‌చ్చితంగా వైద్యుల‌ను సంప్ర‌దించాలి.ఆస్త‌మా ఉంటే.ఊపిరి ఆడక పోవడం, శ్వాస స‌రిగ్గా అంద‌క‌పోవ‌డం జ‌రుగుతుంది.ఇలా అనిపించినా జాగ్ర‌త్త పడాల్సి ఉంటుంది.ఆస్త‌మా వ‌స్తే.ఏ ప‌ని చేయ‌క‌ పోయినా త‌ర‌చూ ఆయాస ప‌డి పోతుంటారు.ఇక గుర‌క‌, పిల్లి కూతలు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపించినా.ఆస్త‌మా అని భ‌య‌ప‌డాల్సిందే.

ఇక ఆస్త‌మా వ్యాధి ఉన్న వారు త‌ప్ప‌కుండా కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంది.పోష‌కాహారం తీసుకోవాలి.

దుమ్ముకు, ధూళికి దూరంగా ఉండాలి.ఆయిల్ ఫుడ్స్‌, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటిని డైట్‌లో నుంచి క‌ట్ చేయాలి.

పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి.మ‌ద్య‌పానం, ధూమ‌పానం అల‌వాట్లు ఉంటే మానుకోవాలి.

What Are The Symptoms Of Asthma! Symptoms Of Asthma, Symptoms, Asthma, Health Tips, Good Health, Health, Asthma Patients, Asthma Causes, Asthma Remedies, Asthma Symptoms, Cough, Heart Problems, Respiratory Problems, Snoring, Asthma Solution - Telugu Asthma, Asthma Symptoms, Cough, Tips, Heart Problems, Symptoms, Symptoms Asthma #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube