చిట్లిపోయిన జుట్టును ఈ ఫ్రూట్ ప్యాకుల‌తో నివారించుకోండిలా!

జుట్టు చిట్లి పోవ‌డం చాలా మంది కామ‌న్‌గా ఫేస్ చేసే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.జుట్టు చిట్లి పోవ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి.

 Fruit Packs For Brittle Hair! Fruit Packs, Brittle Hair, Latest News, Hair Care,-TeluguStop.com

ఆహార‌పు అల‌వాట్లు, వాత‌వార‌ణం మార్పులు, కాలుష్యం, పోష‌కాల లోపం, స‌రైన కేర్ లేక‌పోవ‌డం, త‌ర‌చూ హెయిర్ ట్రీట్‌మెంట్స్ చేయించుకోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు చిట్లిపోతూ ఉంటుంది.ఇక ఈ స‌మ‌స్య‌ను నిర్ల‌క్ష్యం చేస్తే.

జుట్టు పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌.కాబ‌ట్టి, కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే సులువుగా చిట్లిపోయిన జుట్టును నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

బొప్పాయి చిట్లి పోయిన జుట్టుకు చెక్ పెట్ట‌డంలో అద్భుతంగా స‌హాయ‌ ప‌డుతుంది.

ఒక బౌల్ తీసుకుని అందులో బాగా పండిన బొప్పాయి గుజ్జు మ‌రియు క‌ల‌బంద గుజ్జు వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని కేశాల‌కు బాగా ప‌ట్టించి అర గంట పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం మామూలు షాంపూతో త‌ల స్నానం చేసేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చిట్లిపోయిన జుట్టు మ‌ళ్లీ నార్మ‌ల్‌గా మారుతుంది.

అలాగే అవకాడో పండుతో కూడా చిట్లిన జుట్టును నివారించుకోవ‌చ్చు.ముందు అవ‌కాడో పండును పేస్ట్ చేసుకోవాలి.ఆ పేస్ట్‌లో ఆలివ్ ఆయిల్ వేసి బాగా క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు అప్లై చేసి గంట పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో హెడ్ బాత్ చేయాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇక యాపిల్ పండుతో కూడా చిట్లిన జుట్టుకు చెక్ పెట్ట‌వ‌చ్చు.ఒక బౌల్‌లో యాపిల్ పేస్ట్, పెరుగు మ‌రియు నిమ్మ ర‌సం వేసి క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు అప్లై చేసి.అర గంట పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత త‌ల స్నానం చేయాలి.ఇలా వారంలో ఒక‌టి లేదా రెండుసార్లు చేస్తే.

జుట్టు హెల్తీగా మ‌రియు షైనీగా మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube