వేసవిలో పండ్లరసాలు తీసుకోవడం ద్వారా శరీరానికి ఎన్ని లాభాలో తెలుసా..?!

వేసవి కాలంలో దాహం ఎక్కువగా వేస్తుంటుంది.ఇక మనం వేసవిలో చల్లని పానీయాలు తీసుకోవడానికి మొగ్గు చూపుతూ ఉంటాము.

 Amazing Health Benefits Of Drinking Fruit Juices In Summer, Summer Season, Fruit-TeluguStop.com

ఇక చాల మంది పండ్లతో ఇంట్లోనే జ్యూస్ చేసుకొని తాగుతుంటారు.ఇక వేసవిలో ఎక్కువగా దొరికేవి పుచ్చకాయ.

నిమ్మకాయ, మామిడి, మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల శక్తిని కోల్పోకుండా ఉంటాము.వీటి వల్ల శరీరానికి ఎంతో శక్తి అందుతుంది.

ఎండా కాలంలో ఇవి తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

అయితే ఈ పండ్ల రసాలతో విటమిన్‌-ఎ, సి లు పుష్కలంగా ఉంటాయి.

వీటిని తీసుకోవడం ద్వారా మలబద్ద సమస్య తొలగిపోతుంది.ఎండ వేడి వల్ల మూత్రంలో మంటను నివారించవచ్చు.

కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండ చేస్తాయి.చర్మానికి కొత్త యవ్వనం వచ్చేలా చేస్తాయి.

పేగుల్లో మలినాలు తొలగిపోయి శుద్ది చేస్తాయి.ఎసిడిటి, అల్సర్‌ సమస్యను నివారిస్తాయి.

నిమ్మకాయలు, పచ్చి మామిడి జ్యూస్‌ లలో పోటాషియం బి6, బి1,బి2 విటమిన్స్‌ పుష్కలంగా అందుతాయి.అజీర్తి సమస్య దూరం అవుతంది.

Telugu Benefits Fruit, Benefits, Cool Drinks, Fruits, Care, Tips, Season-Telugu

అంతేకాదు.పండ్ల రసాలను తీసుకోవడం వలన శరీరంలో నీటి శాతం పెరుగుతుంది.బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.పుచ్చకాయలు ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి.

గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.డయాబెటిస్‌ వ్యాధిని అదుపులో ఉంటుంది.

శరీరంలో ఉన్న వ్యర్థలను తొలగిపోతాయి.ఇలా పండ్ల రసాలను ప్రతి రోజు తీసుకున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వేసవిలో పండ్ల రసాలతోనే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని అంటున్నారు.దాహం ఎక్కువగా ఉండటం, అందులో అహారం తక్కువ తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఇక అందుకే ఇతర పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌లను తీసుకోవడం కంటే పండ్ల రసాలు తీసుకోవడం ఎంతో ఉత్తమం.ఈ పండ్ల రసాలతో ఇలాంటి ప్రయోజనాలే కాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు.

ఈ జ్యూస్‌ ల కారణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయని, రక్తం శుద్ది అవుతుందని చెబుతున్నారు.వాటర్‌మిలన్‌ జ్యూస్‌ కాకుండా తీసుకుంటే ఇంకా ఎంతో మంచిదంటున్నారు.

ఎండా కాలంలో ఎక్కువగా పండ్ల రసాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube