అలర్ట్: నేటి నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపివేత.. ఎందుకంటే..!?

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్  వేవ్ విజృంభన ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకి అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

 Alert: Srivari Sarvadarshana Will Be Stopped From Today Because Ttd, Special E-TeluguStop.com

ఈ క్రమంలో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు కరోనా భారిన పడిన సంగతి అందరికి తెలిసిందే.  విజృంభన  ఎక్కువ అవ్వడంతో అలర్ట్ అయిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కరోనా  వాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా కరోనా విజృంభన ఎక్కువగా ఉండడంతో భక్తుల శ్రేయస్సు కొరకు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కీలక నిర్ణయం తీసుకున్నారు.నేటి నుంచి శ్రీవారి సర్వదర్శనం నిలిపి వేయాలని నిర్ణయం తీసుకుంది.

అంతే కాకుండా నేటి నుంచే సర్వ దర్శనం టికెట్లు నిలిపివేయాబోతున్నట్లు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.నేటి నుంచి కేవలం 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం మాత్రమే తిరుమలలో కొనసాగుతాయని టిటిడి దేవస్థానం వారు స్పష్టంగా తెలియజేశారు.

కేవలం కరోనా మహమ్మారి విజృంభన నియంత్రించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి యాజమాన్యం వారికి సహకరించాలని కోరారు.

అంతేకాకుండా ఆలయానికి వచ్చే భక్తులు అందరూ కూడా కరోనా వైరస్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరారు.మరోవైపు తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభన గురించి తెలిసిన విషయమే.

 రోజు వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు  నమోదు అవుతున్నాయి.మళ్లీ తిరిగి సర్వ దర్శనం టిక్కెట్లు ఎప్పుడు జారీ చేస్తారన్న విషయంపై టీటీడీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube