ఏజెంట్ కోసం మోహన్ లాల్ ని దించుతున్న సురేందర్ రెడ్డి

అక్కినేని నాగార్జున నట వారసుడు అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాస్ నిర్మించాడు.

 Mohanlal Play Interesting Role In Agent Movie, Akkineni Akhil, Tollywood, Surend-TeluguStop.com

పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఇక యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు.

ఇక ఈ సినిమాని అఖిల్ చాలా గట్టి హోప్స్ పెట్టుకొని ఉన్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు జరగడంతో పాటు సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ని కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇందులో డిఫరెంట్ స్టైల్ లో మాసివ్ లుక్ లో అఖిల్ కనిపిస్తున్నాడు.మాసిన గెడ్డంతో, సిగరెట్ తాగుతూ ఉన్న అతని ఫస్ట్ లుక్ బట్టి క్యారెక్టర్ ని సురేందర్ ఎలా డిజైన్ చేశాడో అర్ధమవుతుంది.

ఈ సినిమాలో అఖిల్ ఓ అండర్ కవర్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడని అర్ధమవుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని సురేందర్ రెడ్డి సంప్రదించినట్లు తెలుస్తుంది.

ఈ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని టాక్ నడుస్తుంది.పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మోహన్ లాల్ సినిమాలో కనిపిస్తాడని బోగట్టా.

ఇక అతను కూడా సినిమాలో నటించడానికి ఒకే చెప్పాడని తెలుస్తుంది.త్వరలో ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube