అరణ్య సినిమాకి 14 కోట్లు నష్టం... క్లోజింగ్ కలెక్షన్

విభిన్న చిత్రాలతో కెరియర్ ప్లాన్ చేసుకుంటూ కేవలం తెలుగు బాషకి మాత్రమే పరిమితం కాకుండా అన్ని లాంగ్వేజ్ లలో సినిమాలు చేస్తున్న నటుడు దగ్గుబాటి రానా.హీరోగా కంటే నటుడుగానే తనని తాను ఎలివేట్ చేసుకోవడానికి రానా ఇష్టపడతాడు.

 Aranya Closing Collection Only 5 Crores, Prabhu Solomon, Rana Daggubati, Tollywo-TeluguStop.com

ఇక రానా ప్రభు సాల్మాన్ దర్శకత్వంలో అరణ్య అనే సినిమాలో నటించాడు.భారీ బడ్జెట్ తో ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమాని నిర్మించింది.

అడవులు, వన్యప్రాణుల సంరక్షణ పాయింట్ తో ఈ కథాంశంని నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో దర్శకుడు రాసుకొని తెరకెక్కించాడు.ఎక్కడా కూడా తగ్గకుండా ఫారెస్ట్ లోనే ఈ సినిమా షూటింగ్ జరిపారు.

అలాగే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన రియల్ ఏనుగులని ఈ సినిమా కోసం ఉపయోగించారు.రానా కూడా తన లుక్, బాడీ లాంగ్వేజ్ అంతా మార్చుకొని అరణ్య సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టాడు.

అతని కష్టం తెరపై అడుగడుగునా కనిపిస్తుంది.పాత్ర చిత్రణ, నటీనటుల ప్రతిభ ఎంత ఉన్నా, మంచి కథని ఎంచుకున్న ఒక్కోసారి అలాంటి వాటితో ప్రేక్షకులని ఎంగేజ్ చేయడం కష్టం అవుతుంది.

ఇప్పుడు అరణ్య విషయంలో కూడా అదే జరిగింది.ఈ సినిమా కోసం ఎంచుకున్న పాయింట్, కథాంశం, పాత్రల చిత్రణ అంతా బాగున్నా ఆడియన్స్ ఎక్కడో డిస్ కనెక్ట్ అయిపోయాడు.

ఎమోషనల్ గా ప్రేక్షకులని కన్విన్స్ అయ్యేలా చెప్పడంతో దర్శకుడు విఫలం కావడంతో అరణ్య అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేదు.దీంతో మొదటి రోజు ఎవరేజ్ టాక్ వచ్చిన క్రమంగా డివైడ్ టాక్ వైపు వెళ్ళిపోయింది.

దానికితోడు కరోనా సిచువేషన్ కారణంగా థియేటర్ లో సినిమా చూడటానికి ప్రేక్షకుడు అంతగా ఆసక్తి చూపించలేదు.దీంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయారు.ఇక ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ మొత్తం 5.10 కోట్లు మాత్రమే వచ్చింది.బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 19 కోట్ల వరకు రావాల్సి ఉంది. దీంతో సినిమా ద్వారా 14 కోట్ల మేరకు నష్టాలు చవిచూసిందని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube