ఇలాంటి చెత్త కథ వద్దు అంటూ ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ రిజెక్ట్ చేస్తే సినిమాగా వచ్చి హిట్ అయ్యింది

కొన్నిసార్లు కొంద‌రి నుంచి తిర‌స్క‌ర‌ణ‌కు గురైన అంశాలే మ‌రికొంద‌రి నుంచి మంచి ఆద‌ర‌ణ‌కు నోచుకుంటాయి.అలాంటి సినిమానే జంబ‌ల‌కిడిపంబ.

 Unknown Facts About Jambalakidi Pamba Movie, Jambalakidi Pamba, Naresh , Evv Sat-TeluguStop.com

జంధ్యాల ద‌గ్గ‌ర అసోషియేట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేస్తున్న ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ఓ క‌థ రాశాడ‌ట‌.ఆడ‌ది మ‌గాడైతే అనే పేరుతో రాసిన ఈ స్టోరీని ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌కు పంపించాడ‌ట‌.

ఇదీ ఓ క‌థా అంటూ దాన్ని తిప్పి పంపార‌ట స‌ద‌రు ప‌త్రిక సంపాద‌కుడు.అదే క‌థ జంధ్యాల‌కు చెప్పాడ‌ట ఈవీవీ.

క‌థ బాగానే ఉన్నా.సినిమా ఆడుతుందో లేదో అని అనుమానం వ్య‌క్తం చేశాడ‌ట జంధ్యాల‌.

దీంతో ఆక‌థ కాస్త ప‌క్క‌కు ప‌డింద‌ట‌.

కొద్ది రోజుల త‌ర్వాత ఆ స్టోరీకి కాస్త మ‌సాలా ద‌ట్టించి క‌థ‌ను తిర‌గ‌రాశాడ‌ట ఈవీవీ.

జంధ్యాల ద‌గ్గ‌ర ప‌నిచేసే స‌మ‌యంలో ప‌రిచ‌యం అయిన డీవీవీ దాన‌య్య‌కు ఈ క‌థ చెప్పాడ‌ట‌.సేమ్ జంధ్యాల డౌట్సే ఆయ‌నా చెప్పాడ‌ట‌.

అయితే అంతలా భ‌యం ఉంటే తాను కూడా కొంత డ‌బ్బు ఈ సినిమాలో పెడ‌తాను అని ఈవీవీ చెప్పాడ‌ట‌.ఈ సినిమాను రాజేంద్ర ప్ర‌సాద్ హీరోగా పెట్టి తీయాలి అనుకున్నాడ‌ట ఈవీవీ.

కానీ ఆయ‌న చాలా బిజీగా ఉండి డేట్స్ ఖాళీగా లేక‌పోవ‌డంతో న‌రేష్ ను హీరోగా ఎంపిక చేశాడ‌ట‌.క‌థ న‌చ్చ‌డంతో న‌రేష్ ఓకే చెప్పాడ‌ట‌.

హీరోయిన్స్ మాత్రం ఎవ‌రూ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు.త‌మిళంలో రెండు సినిమాలు చేసిన మీనాక్షి అనే అమ్మాయిని తీసుకున్నారు.

ఆమె పేరును ఆమ‌నిగా మార్చారు ఈవీవీ.

Telugu Amani, Dvv Danayya, Jandayala, Naresh, Tollywood-Telugu Stop Exclusive To

ఈ సినిమాకు రివ‌ర్స్ గేర్ అనే పేరు పెట్టారు.అయితే ప్రొడ్యూస‌ర్ కి ఇది మొద‌టి సినిమా కావ‌డంతో ఆ పేరును జంబ‌ల‌కిడిపంబ‌గా మార్చారు.వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో 50 ల‌క్ష‌ల రూపాయ‌లు పెట్టి నెల రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేశారు.1992 డిసెంబర్ లో సినిమా విడుద‌ల అయ్యింది.ఎవరికీ పెద్దగా ఎక్కలేదు.

బాక్స్ లన్ని తిరిగి వెనక్కి వ‌చ్చాయి.ఈ సినిమా వచ్చి పోయినట్టు కూడా ఎవరికి తెలియదు.

ఆ మ‌రుస‌టి ఏడాది ఈవీవీ నాగార్జున హీరోగ వార‌సుడు అనే మూవీ చేశాడు.ఈ మూవీ సూప‌ర్ హిట్ అయ్యింది.

నాగ్ స్టార్ హీరో అయ్యాడు.ద‌ర్శ‌కుడికి మంచి గుర్తింపు వ‌చ్చింది.

ఇదే ఈపులో జంబ‌ల‌కిడిపంబను 1993 జులై 12న మ‌ళ్లీ విడుద‌ల చేశారు.ఈ సినిమా బంప‌ర్ హిట్ అయ్యింది.జ‌నాలు థియేట‌ర్ల‌కు క్యూ క‌ట్టారు.న‌వ్వి న‌వ్వి అల‌సిపోయారు.50 ల‌క్ష‌ల‌తో తీసిన ఈ మూ‌వీ అప్ప‌ట్లోనే 2 కోట్లు వ‌సూలు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube