అలా చేయొద్దు...పవన్ అభిమానిపై అనసూయ వైరల్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం వకీల్ సాబ్.గత మూడున్నరేళ్లుగా ఒక్క సినిమా చేయని పవన్ కళ్యాణ్ అభిమానులను నిరీక్షణలో ఉంచాడు.

 Don't Do That ... Anasuya Viral Comments On Pawan Fan Anchor Anasuya, Vakeelsaab-TeluguStop.com

ఇక మూడేళ్ల ఆకలితో ఉన్న పవన్ అభిమానులకు వకీల్ సాబ్ సినిమా విడుదల పండగే అని చెప్పవచ్చు.ఒక్క ట్రైలరే ఎన్ని రికార్డులు సృష్టించిందో మనం చూసాం.

ట్రైలర్ కు పవన్ అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు.థియేటర్ ల అద్దాలు పగలగొట్టుకొని మరీ ట్రైలర్ ను చూడడానికి వెళ్ళారంటే పవన్ అభిమానుల ఆత్రుత ఎంత ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు.

పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉండరు భక్తులే ఉంటారని అభిమానులే చెబుతారు.ఎందుకంటే ఏ హీరోకైనా సినిమా హిట్ లు, ఫ్లాప్స్ ను బట్టి అభిమానులు పెరుగుతూ ఉంటారు.

కాని పవన్ కళ్యాణ్ కు అభిమానులు పెరగడమే కాని తగ్గడం అనేది ఉండదు.ఇది అక్షరాల నిజం అనేది ఎన్నో సార్లు రుజువైంది.అయితే తాజాగా ఓ అభిమాని వకీల్ సాబ్ విడుదల రోజు తెర ముందు నిలబడి తన చేయిని కోసుకొని ఆ రక్తంతో పీఎస్పీకే అని రాసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.ఇక ఆ సదరు అభిమాని చేసిన ఈ పనిపై యాంకర్ అనసూయ స్పందించింది.

అభిమానానికి హద్దులు ఉంటాయని, మరీ ప్రాణాలకు తెగించేంత అభిమానం ప్రమాదకరమని, ఇలా చేస్తే ఇంట్లో మీ అమ్మానాన్నలు ఎంత బాధపడతారో కూడా అర్థం చేసుకోపోతే ఎలా అంటూ తన అసంతృప్తిని బయటపెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube