ఆ రాజుకు ఏడాదికి ఒక కన్యతో పెళ్లి..! ఎక్కడంటే..?!

ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని చోట్ల అనేక రకాల వింతైన నియమాలు, చట్టాలు అమల్లో కొనసాగుతూనే ఉన్నాయి.ప్రపంచంలో చాలా కాలం కిందటే రాచరిక వ్యవస్థను రద్దు చేయబడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

 The King Marries A Maiden Every Year   Where Is It, Marriage, King, Virgins, Swa-TeluguStop.com

అందుకు ప్రధానమైన కారణం రాజులు  విధించే వింతవింత నియమాలు అలాగే వారు తీసుకువచ్చే చట్టాలు.చాలాకాలం క్రితమే రాచరిక వ్యవస్థను రద్దు చేసినప్పటికీ.

ఆఫ్రికా ఖండం లో మాత్రం ఓ దేశంలో ఇప్పటికీ రాచరిక వ్యవస్థ నడుస్తూనే ఉంది.ఆ దేశంలో రాజే సర్వాధికారుడు.

ఆ దేశం పేరు స్వాజిలాండ్.ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయింది.

ఇదివరకు కాలంలో దక్షిణాఫ్రికా తో కలిసి ఈ దేశం అంతర్ భాగంగా ఉండేది.ఇకపోతే ఈ దేశంలో ఓ విచిత్రమైన సంప్రదాయం కొనసాగుతూనే ఉంది అది తెలిసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు.

ఆ దేశంలో ప్రతి సంవత్సరం ‘ఉమ్లంగా సెరెమణి’ అనే పండగ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో జరుగుతుంది.ఈ ఉత్సవం రాజు తల్లి ఊరైన లుడ్జిగిని రాజ గ్రామంలో జరుగుతుంది.

ఈ వేడుకలలో పదివేల మందికిపైగా కన్యలు పాల్గొంటారు.ఇలా వచ్చి న కన్యలలో ఆ రాజు ఓ యువతిని పెళ్లి చేసుకుంటాడు.

ఈ తతంగం మొత్తం ఏడాదికోసారి జరుగుతూనే ఉంటుంది.ప్రస్తుతం పాలిస్తున్న మూడవ మూడవ మస్వతి రాజుకు ఇప్పటికే 15 మంది భార్యలు ఉన్నారు.

అయినప్పటికీ ఇప్పటికీ ఆ దేశంలో ఈ విధానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

ఆ దేశంలో ఉన్న ప్రజలు 63 శాతం మంది ఇప్పటికి దారిద్ర రేఖకు దిగువన ఉన్న కానీ వాటినన్నిటిని పట్టించుకోకుండా రాజు మాత్రం విలాసవంతమైన జీవనం సాగిస్తారని అతనిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.

ఆ దేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక అవస్థలు పడుతున్నారు.ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే రాజుకు మాత్రం బిలియన్ల ఆస్తి ఉండడమే కాకుండా దాని విలువ రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube