అల్లు అర్జున్ కెరియర్ లో హైయెస్ట్ వ్యూస్ సొంతం చేసుకున్న పుష్పరాజ్

ఐకాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో తనని తాని ఎలివేట్ చేసుకోవడానికి చేస్తున్న సినిమా పుష్ప.ఈ సినిమాలో పుష్పరాజ్ అనే గంధపు చెక్కల దొంగగా అల్లు అర్జున్ పాత్ర ఉండబోతుంది.రాయలసీమ నేపధ్యంలో అతని పాత్ర, డైలాగ్ డిక్షన్ ఉంటుంది.కెరియర్ లో అల్లు అర్జున్ చేస్తున్న పక్కా మాస్ రోల్ ఇదే కావడం విశేషం.ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి దర్శకుడు సుకుమార్ ఇంటెన్సన్సిటీ క్రియేట్ చేస్తున్నాడు.ఫాహద్ ఫైజల్ ఈ సినిమాలో అల్లు అర్జున్ కి ప్రతినాయకుడుగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది.

 Pushpa Got The Highest Views In The Hero Career, Allu Arjun, Director Sukumar, T-TeluguStop.com

నిజానికి అల్లు అర్జున్ పాత్రనే ఈ సినిమాలో ప్రతినాయక చాయలతో ఉంటుందని బోగట్టా.ఇక తాజాగా బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ని లాంచ్ చేశారు.

దీనిలో పవర్ ప్యాక్డ్ యాక్షన్, ఎలివేషన్ షాట్స్ ని నింపేశారు.ఓ విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ ని సరికొత్తగా మునుపెన్నడూ చూడని విధంగా ఈ టీజర్ గా సుకుమార్ ఆవిష్కరించారు.

ఇదిలా ఉంటే ఈ టీజర్ కి సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది.

పుష్పరాజ్ ఫస్ట్ గ్లింప్స్ కి రెండు రోజుల్లో 30 మిలియన్స్ వీక్షణలతో పాటు 1 మిలియన్ కు దగ్గరలో లైక్స్ దక్కించుకొని ట్రెండింగ్ లో ఉంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక వ్యూస్ రాబట్టుకున్న ఇంట్రడక్షన్ వీడియోగా రికార్డు దక్కించుకుంది.ప్రస్తుతం యూట్యూబ్లో అయితే ట్రెండింగ్ అవుతున్న వీడియోలలో పుష్ప గ్లింప్స్ అగ్రస్థానంలో ఉంది.

ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పా రాజ్ పేరుతో ఈ వీడియో అల్లు అర్జున్ అభిమానులకు భారీ ట్రీట్ ఇచ్చింది.మొత్తానికి అల్లు అర్జున్ ని పాన్ ఇండియా రేంజ్ లో ఆవిష్కరించడానికి అల్లు అర్జున్ అతన్ని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube