'ఏజెంట్‌' లుక్ చూస్తుంటే సూపర్‌ స్టార్‌ మూవీ గుర్తుకు వస్తుందంటున్నారు

అక్కినేని అఖిల్‌ హీరోగా ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.ప్రస్తుతం నాల్గవ సినిమా మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ విడుదలకు సిద్దంగా ఉంది.

 Akhil Look In Agent Movie Is Like Mahesh Babu Atithi, Agent ,akhil Agent Film Ne-TeluguStop.com

బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన కారణంగా సినిమా పై అంచనాలు పెద్దగా లేవు.సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అక్కినేని అభిమానుల్లో పెద్దగా కనిపించడం లేదు.

సినిమా విడుదల సమయం వరకు ఏమైనా ఆసక్తి పెరుగుతుందేమో చూడాలి.అఖిల్‌ అక్కినేని అయిదవ సినిమా ప్రకటన వచ్చింది.

స్టైలిష్‌ దర్శకుడు సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించబోతున్నారు.అనీల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.

ఎందుకంటే దర్శకుడు సురేందర్‌ రెడ్డి గతంలో మంచి సక్సెస్‌ లను దక్కించుకున్నాడు.అంచనాలకు తగ్గట్లుగా అఖిల్‌ 5 సినిమాకు ఏజెంట్‌ అనే టైటిల్‌ ను ఖరారు చేసి ఫస్ట్‌ లుక్‌ ను కూడా విడుదల చేయడం జరిగింది.

ఏజెంట్‌ ఫస్ట్‌ లుక్‌ పై సోషల్‌ మీడియాలో పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.ఇదే సమయంలో అఖిల్‌ లుక్‌ చూస్తుంటే మహేష్‌ బాబు ను అతిథి సినిమాలో చూసినట్లుగా అనిపిస్తుందని అంటున్నారు.

మహేష్‌ బాబు అతిథి సినిమా నిరాశ పర్చినా కూడా ఆ సినిమాలో ఆయన లుక్‌ కు మాత్రం మంచి స్పందన వచ్చింది.ఆ పొడవైన జుట్టు మరియు స్టైలిస్ డ్రస్‌ లు మహేష్‌ బాబు ఆకట్టుకున్నాడు.

ఇప్పుడు అతిథి లుక్‌ మాదిరిగానే దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఏజెంట్‌ లుక్‌ ను విడుదల చేయడం జరిగింది.ఈ లుక్‌ అక్కినేని అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది.సినిమా సక్సెస్‌ అవుతుందేమో అనే నమ్మకంను పెంచుతుందని అంటున్నారు.అతిథి సినిమా నిరాశ పర్చినా కూడా ఇప్పుడు ఆ సినిమా టీవీలో మంచి పేరు దక్కించుకుంది.

అంటే ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా దర్శకుడు ఈ సినిమాను తీస్తున్నాడని అనిపిస్తుంది.ఏజెంట్‌ తో అఖిల్‌ మొదటి కమర్షియల్‌ సక్సెస్‌ ను అందుకుంటాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube