వైరల్: డాన్స్ చేస్తుండగానే డ్రస్ మార్చేసిన మహిళ డాన్సర్..!

ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక రూపాన టాలెంట్ దాగి ఉంటుంది.ప్రస్తుతం ఆ టాలెంటు ప్రపంచానికి పరిచయం చేయాలంటే మన అరచేతిలోని ఉన్న సెల్ ఫోన్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పవచ్చు.

 Viral Woman Dancer Changes Her Dress While Dancing On Stage , Viral , Viral Vide-TeluguStop.com

మనకు గుర్తింపు తీసుకురావడానికి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటిని అద్భుతంగా మార్చడంతో మంచి పేరును ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్నారు.దీనికి సంబంధించిన ఎన్నో ఉదాహరణలు మనం ఇదివరకే చాలానే చూశాం.

తాజాగా ఇందుకు తార్కాణంగా ఉండే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఈ వీడియోలో ఉన్న మహిళ డాన్సర్ స్టేజి మీద డాన్సు చేస్తున్న సమయంలో కళ్ళు మూసి తెరిచే లోపే డ్రస్ మార్చుకోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఈ వీడియోలో మొదట్లో ఆ మహిళ డాన్సర్ కళ్ళు మిరమిట్లు గొలిపేట్లుగా నీలం రంగు డ్రెస్ ధరించి డాన్స్ మొదలు పెట్టేసింది.

అయితే ఆమెతో పాటు డాన్స్ చేస్తున్న పార్టనర్ ఇద్దరి డ్రస్సులు మ్యాచ్ కాలేదని నిరాశకు గురి అవుతున్నట్లు మొఖాన్ని పెట్టగా.దాంతో ఆ సదరు మహిళ డాన్సర్ డాన్స్ కొనసాగిస్తూనే 2 – 3 స్టెప్స్ వేసిన తర్వాత ఆ మహిళ డాన్సర్ ఒంటి మీద ఉన్న డ్రస్ మారిపోయింది.

దీంతో ఆ షో చూస్తున్న వారందరూ అసలు ఇలా ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.

మొదట ప్రదర్శనకు నీలం రంగులో వచ్చిన మహిళ ఒకేసారి గోల్డ్ అండ్ బ్లాక్ రంగులో ఉన్న డ్రెస్ లోకి మారడంతో అందరూ ఆశ్చర్యపోయారు.అయితే ఈ డాన్స్ షో ఎక్కడ జరిగిందో వారి పేరు ఏంటో బయటకు రాకపోయినా.ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ వీడియోని బాలీవుడ్ దర్శకుడు శిరీష్ కుందర్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఆమెపై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరికొంతమంది అసలు అలా ఎలా సాధ్యం చేయగలిగారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube