భారత్ ప్ర‌యాణికుల‌పై నిషేధం విధించిన న్యూజిలాండ్.. ఎందుకోసం అంటే.. ?

గత సంవత్సరం తాలూకు పరిస్దితులు కరోనా వల్ల ప్రతి దేశంలో నెలకొంటున్నాయి.ఇంకా పూర్తిగా అంతం అవ్వని కరోనా వైరస్ కొంత కాలం నిదురించినట్లుగా నటించి, ప్రస్తుతం లోకం మీద పడింది.

 New Zealand Bans Indian Travelers Why New Zealand, Suspends, India, Travellers-TeluguStop.com

కరోనా కేసులు తగ్గుముఖం పట్టగానే ఊపిరి పీల్చుకున్న ప్రజలు మళ్లీ వస్తున్న కరోనా ఉదృతిని చూస్తుంటే ఆందోళనకు గురవుతున్నారట ఈ నేపధ్యంలో కొన్ని దేశాలైతే కరోనా కట్టడికి కావలసిన చర్యలను పకడ్బందీగా అమలు చేయడానికి నడుం బిగించాయి.

ఈ క్రమంలోనే న్యూజిలాండ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

భార‌త్ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై నిషేధం విధించాల‌ని, ఈ మేర‌కు న్యూజిలాండ్ ప్ర‌ధాన‌మంత్రి జెసిండా ఆర్డెర్న్ అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు.ఇకపోతే భార‌త ప్ర‌యాణికుల‌తో పాటుగా న్యూజిలాండ్ పౌరుల‌పై కూడా నిషేధం తాత్కాలికంగా విధించిన‌ట్లు పేర్కొన్నారు.

కాగా ఏప్రిల్ 11వ తేదీ నుంచి 28వ తేదీ వ‌ర‌కు ఈ నిబంధ‌నలు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.ఇదిలా ఉండగా కోవిడ్ కేసులు ఎక్కువగా భారత్‌లో నమోదవుతుండటంతో మిగతా దేశాలు కూడా కాస్త భయపడుతున్నాయట.

ఎందుకంటే భార‌త్‌లో నిన్న ఒక్క‌రోజే ల‌క్షా 25 వేలకు చేరువ‌లో పాజిటివ్ కేసులు న‌మోదు అవడం ఈ ఆందోళనకు కారణం అవుతుందట.ఇక కోవిడ్ టీకాకు పుట్టిల్లు అయిన మనదేశంలోనే పరిస్దితులు ఇలా ఉంటే మిగతా దేశాల సంగతి చెప్పక్కర లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube