ఆ దేశంలో కరోనా వల్ల వేలల్లో మరణాలు.. అయినా లాక్‌డౌన్‌కు నో అంటున్న అధ్యక్షుడు.. ?

ప్రస్తుతం ప్రపంచాన్ని మరో సారి భయం అనే అగాధంలోకి నెట్టివేస్తున్న రక్కసి కరోనా సెకండ్ వేవ్.మొదటి దశలో ఎలాగైతే చాపకింద నీరులా విస్తరించిందో, ప్రస్తుతం కూడా ఇలాగే కోవిడ్ వ్యాపిస్తుందట.

 Thousands Of Deaths Due To Corona Second Wave In Brazil ,  Brazil, President, Za-TeluguStop.com

ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా కొరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో కరోనా విషయంలో చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది.

ఇకపోతే బ్రెజిల్ లో కరోనా మరణాలు రోజుకు ఇంచుమించు నాలుగువేల వరకు చోటు చేసుకుంటున్నాయట.ఈ పరిస్దితుల్లో ఏ ప్రభుత్వం అయిన లాక్‌డౌన్ విధిస్తుంది.

కానీ బ్రెజిల్ దేశాధ్యక్షుడు మాత్రం లాక్‌డౌన్ విధించబోమని, లాక్‌డౌన్ అనేది రాజకీయమే అంటూ అన్నింటినీ మూసేయాలనే పాలిటిక్స్‌ను నేను యాక్సెప్ట్ చేయను.ఎట్టిపరిస్థితుల్లో దేశంలో లాక్‌డౌన్ విధించబడదని వెల్లడిస్తున్నారు.

Telugu Corona, Brazil, Brazil Corona, Coronaeffect, Corona Wave, Lockdown, Zaire

ఇకపోతే ఈ అధ్యక్షుడు గతేడాది కరోనా ముప్పును చిన్నచూపు చూశారు.అందువల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఈ దేశంలో చోటు చేసుకుందట.అయినా ఇంకా ఆయన వైఖరిలో మార్పు రాలేదని కొందరు భావిస్తున్నారట.ఇకపోతే బ్రెజిల్ లో నిన్న ఒక్క రోజే 3829 మంది కరోనాతో మరణించారని, అంతకు క్రితం 4195 మరణాలు చోటు చేసుకున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు.

అయినా గానీ బ్రెజిల్ దేశాధ్యక్షుడు బోల్సోనారో మాత్రం కరోనా కట్టడి చర్యలపై విముఖంగా ఉన్నారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube