చెత్త పేరుతో ఎంత దోచేస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు.. నగర ప్రజలూ.. !

నగరజీవికి ఏ వైపు నుండి చూసిన తలనొప్పులు ఎక్కువే.ఎందుకంటే ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు ప్రతి పని పైసతో ముడిపడి ఉంటుంది.

 Housing Wastage Money Collecting By Municipal Workers Include Property Tax , Mun-TeluguStop.com

మరి ఈ కష్టాలు భరించాలంటే చేతి నిండా డబ్బులుండాలి.కానీ ప్రస్తుత పరిస్దితి అందుకు విరుద్దంగా ఉంది.

ఇకపోతే ఎవరికైనా పని చేసినందుకు నెలకు ఒక్కసారే జీతం ఇస్తారు.కానీ జీహెచ్ఎంసీ కార్మికులకు మాత్రం నగర ప్రజలు రెండు సార్లు జీతాన్ని చెల్లిస్తున్నారట.అదెలా అని ఆలోచిస్తున్నారా?.ఇంటి నుంచి చెత్తను సేకరించినందుకు ప్రతినెలా రూ.80 నుండి 100 చెల్లిస్తున్నారు కదూ.

చెత్తను కలెక్షన్ చేసి డంప్ యార్డులకు చేర్చే బాధ్యత ముమ్మాటికీ జీహెచ్ఎంసీదే.ఇందుకోసం ఆస్తిపన్నులో చెత్త ట్యాక్స్‌ను కలిపే వసూలు చేస్తున్నట్టు మున్సిపల్ చట్టం 1955 చెబుతోంది.ఈ చట్టంలోని సెక్షన్ 199 నుంచి 201 వరకూ ఈ విషయాన్ని వివరిస్తున్నాయి.

కానీ ఈ విషయం తెలియక ఏదో సానుభూతితో ఇచ్చే డబ్బులను ప్రస్తుతం కార్మికులు జబర్దస్త్‌గా వసూలు చేస్తున్నారట.

Telugu Dump Yards, Ghmc, Wastage, Hyderabad, Tax-Latest News - Telugu

నెల నెలకు ఆ డబ్బులు ఇవ్వకుంటే చెత్త కార్మికులు ఆ చెత్తను తీసుకు వెళ్లరు.ఇదొక రూల్ గా మారిపోయింది ప్రస్తుతం.ఇకపోతే సిటీలో 20 లక్షల కుటుంబాలు, ఒక లక్ష వరకూ చిన్న వ్యాపార సముదాయాల నుంచి ప్రతీ రోజూ 6500 నుంచి 7 వేల టన్నుల వరకూ చెత్త ఉత్పత్తవుతున్నట్టు అంచనా.

మరి ఈ క్రమంలో ఇంటికి కనీసం రూ.80 చొప్పున వేసుకున్న నెలకు రూ.16 కోట్ల 80 లక్షలను సిటీ ప్రజలు చెత్త సేకరించేందుకు ఇస్తున్నారు.ఇది ఏడాదికి రూ.201.60 కోట్లు దాటుతోంది.అంటే ప్రజలకు తెలియకుండానే ఎంత నష్టపోతున్నారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube