వైరల్ : వృత్తి ధర్మానికి అసలైన నిదర్శనం వీరే..!

ఈ ప్రపంచంలో పని చిన్నదా, పెద్దదా అని చూడరు కొంతమంది.ఎవరికి నచ్చిన పనిని వారు చేసుకుంటూ వారి వృత్తి పట్ల గౌరవంగా ఉంటూ జీవితంలో ఓ ముందుకు కొనసాగే వాళ్ళని  మనం చూస్తూనే ఉంటాం ప్రస్తుత రోజుల్లో చాల మంది ఉన్న  పనిని  తప్పించుకోవడానికి అనేక కారణాలు చెబుతూ ఉంటారు.

 Viral: They Are The Real Proof Of Professionalism  China, Firefighters , Video,-TeluguStop.com

కానీ చైనాకు చెందిన ఒక అగ్నిమాపక సిబ్బంది మాత్రం వారి వృత్తి పట్ల చాలా శ్రద్ధగా వహిస్తారు.ఈ అగ్నిమాపక సిబ్బంది గురించి తెలుసుకుంటే అసలు వృత్తి ధర్మం ఏంటో అందరికి ఇట్టే  తెలిసిపోతుంది.

చైనాకు చెందిన ఒక ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది వారి వృత్తి పట్ల పాటించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.

ఇక అగ్నిమాపక సిబ్బంది బాత్రూంలో స్నానం చేస్తున్న వేళ ఏదో ప్రమాదం సంభవించిందని హెచ్చరికగా ఒక పెద్ద సైరన్ మోగింది.దీంతో అతడు  ఏ పరిస్థితిలో ఉన్నానో అని ఆలోచించకుండా వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని లేకపోతే ఆస్తి లేదా ప్రాణ నష్టం జరుగుతుందని భావించి కనీసం ఒంటిపై ఉన్న సబ్బును కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి అట్లాగే బయటికి వచ్చేశాడు.

ఈ క్రమంలో కాళ్లకు సబ్బు ఉండడంతో కాలు జారీ కింద పడ్డాడు.అయినా కానీ అవేవి పట్టించుకోకుండా ఆ సదరు వ్యక్తి  వృత్తి పట్ల ఉన్న గౌరవానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.

మరోక అగ్నిమాపక సిబ్బంది ఫైర్ వెహికల్ లో తలపై ఉన్న షాంపూను కూడా గమనించకుండా యూనిఫాం వేసుకుని ఘటనా స్థలానికి చేరుకోవడనికి ప్రయత్నం చేశాడు.ఇదంతా కూడా అక్కడే ఉన్న సీసీ కెమెరా లో నమోదు అవ్వగా ఆ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

ఇక్కడ అసలు ట్విస్టు ఏమిటంటే ఆలరాన్ని మాక్‌ డ్రిల్‌ లో భాగంగా మోగించారు.వాస్తవానికి ఆ ఆలరాన్ని ఉద్యోగులు అలెర్ట్ గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి నిర్వహిస్తూ ఉంటారట.

ఏది ఏమైనా కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube