డ్రగ్స్‌ కేసు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే దమ్ము కేసీఆర్‌కు ఉందాః రాములమ్మ

తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలకు డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇదే సమయంలో ఒక మంత్రి భూ దందాకు పాల్పడుతున్నట్లుగా ఆడియో టేపులు బయటకు వచ్చాయి.

 Bjp Leader Vijayashanti Comments On Trs And Cm Kcr-TeluguStop.com

ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు.టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విజయశాంతి విరుచుకు పడ్డారు.

ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకునే దమ్ము సీఎం కేసీఆర్‌ కు ఉందా అంటూ ప్రశ్నించింది.ఇదే సమయంలో ఆమె మంత్రి పై వస్తున్న ఆరోపణలపై సీఎం ఎందుకు స్పందించరు అంది.

రాష్ట్రంలో కరోనా టెస్టులు కేంద్రం చెప్పిన అనుసారం కాకుండా ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారని, కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని విజయశాంతి ఆరోపించారు.డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుని తమ ప్రభుత్వం యొక్క చిత్త శుద్దిని నిరూపించుకోవాలంటూ విజయశాంతి సవాల్‌ విసిరారు.

నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కనీసం వారికి మనోధైర్యంగా నిలవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ విజయశాంతి ఆరోపణలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube