'లైగర్' సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ !

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు.ఈయన ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్నాడు.

 Hollywood Stunt Choreographer Andy Long Roped In Liger Movie, Vijay Deverakonda,-TeluguStop.com

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుని ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.

ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాను బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.

ఈ ఫస్ట్ లుక్ కు విశేష స్పందన వచ్చింది.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతుంది.

ఈ సినిమా కోసం విజయ్ స్పెయిల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

ఈ నేపథ్యంలో యాక్షన్ సీన్స్ డిజైన్ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ను తీసుకున్నట్టు తెలుస్తుంది.ఈయన హాలీవుడ్ లో అనేక సినిమాలకు పని చేసాడు.

ఇప్పుడు లైగర్ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ ను తీసుకున్నారు.ఇప్పటి కే ఈయన ఈ సినిమా కోసం తన బృందంతో కలిసి యాక్షన్ సీన్స్ రెడీ చేస్తున్నట్టు సమాచారం.

ఈ సినిమాలో విజయ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.అయితే ఈ సినిమా ను సెప్టెంబర్ 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube