జగన్ బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ ఎంపీ పిటిషన్

జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నమోదైన అవినీతి ఆరోపణలకు సంబంధించిన అనేక కేసులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి.ఇప్పటికే ఈ కేసులో జగన్ 16 నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై బయటకు వచ్చారు.

 Ycp Rebel Mp Raghurama Krishnama Raju Petition Against Jagan Bail , Jagan, Ysrcp-TeluguStop.com

అక్రమాస్తుల కేసులో ఏ 1 గా జగన్ ఉన్నారు.చాలా కాలంగా బీజేపీతో జగన్ సన్నిహితంగా మెలుగుతూ ఉండడంతో, ఆయనపై సిబిఐ దూకుడుగా వ్యవహరించడం లేదని అంతా అనుకున్నారు.

అయితే ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికలలో బిజెపి, వైసిపి మధ్య వైరం నెలకొన్న తరుణంలో, జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.జగన్ 11 చార్జిషీట్లలో a1 నిందితుడిగా ఉన్నారని, రఘురామకృష్ణంరాజు తన పిటిషన్ లో పేర్కొన్నారు.

తాను రాజ్యాంగంపై ప్రమాణం చేశానని, తమ పార్టీకి చెడ్డపేరు రాకుండా చూడాలి అనే ఉద్దేశంతోనే ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.ఈ వ్యవహారాలపై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేయడం వెనక కారణాన్ని కూడా రఘురామకృష్ణంరాజు వివరించారు.జగన్  ఈ కేసుల నుంచి త్వరగా బయటపడాలి అనే ఉద్దేశంతోనే ఈ పిటిషన్ వేసినట్టు , వైసీపీ రాజకీయ ప్రత్యర్ధులకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే తాను ఈ పిటిషన్ దాఖలు చేశానని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

ఇన్ని చార్జిషీట్లు వేసినా విచారణలో జాప్యం జరుగుతోందని, కోర్టుకు వెళ్లకపోవడం పైన అనేక అనుమానాలు ఉన్నాయని, పార్టీకి చెందిన వ్యక్తిగా పార్టీని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఉద్దేశంతోనే ఈ పిటిషన్ వేసినట్లు రఘురామకృష్ణం రాజు చెప్పుకొచ్చారు.

Telugu Delhi, Jagan, Sapuram Mp, Parishad, Tirupati, Ycp Rebel Mp, Ysrcp-Telugu

  కాకపోతే కీలకమైన తిరుపతి ఉప ఎన్నికలు, పరిషత్ ఎన్నికల సమయంలో జగన్ బైయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు కావడం  ఖచ్చితంగా  వైసీపీకి మేలు చేస్తుంది అని, బిజెపి ఈ రకంగా జగన్ ను వేధిస్తుంది అనే సంకేతాలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రమాదం ఉంది అనే భయమూ ఇప్పుడు వైసీపీ ప్రత్యర్ధలలో నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube