నాగార్జున కెరీర్ ప్రమాదంలో పడినట్టేనా..?

విక్రమ్ సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన నాగార్జున సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.ఒక దశలో నాగార్జున నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి.

 Danger Bells To Star Hero Akkineni Nagarjuna Career , Akkineni Nagarjuna, Career-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో నాగార్జున ఎలాంటి కథను ఎంచుకున్నా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కావడం లేదు.ఇటీవల విడుదలైన వైల్డ్ డాగ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది.

వైల్డ్ డాగ్ సినిమాకు ముందు నాగార్జున నటించిన మన్మథుడు 2 కూడా హిట్ కాలేదు.

నాగార్జున నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో నాగార్జున కెరీర్ ప్రమాదంలో పడినట్టేనని ఇండస్ట్రీ వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వైల్డ్ డాగ్ సినిమా రిలీజ్ కు ముందు ఆ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు.మూడు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు 4 కోట్ల లోపే ఉన్నాయి.

చిన్న సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుంటే నాగార్జున మాత్రం గట్టి పోటీని ఇవ్వలేకపోతున్నారు.

Telugu Bagarraju, Career Dielema, Danger Bells, Soggadechinni, Wild Dog, Wild Do

మరోవైపు నాగార్జున ఫ్యాన్స్ మాత్రం నాగార్జున ఫ్యామిలీ కథలను ఎంచుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.సోగ్గాడే చిన్ని నాయన లాంటి కథలను ఎంచుకుంటే నాగార్జున సినిమాలు కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చెబుతున్నారు.మరి నాగార్జున ఈ దిశగా ప్రయత్నాలు చేస్తారేమో చూడాల్సి ఉంది.

నాగార్జున రాబోయే సినిమాలు కూడా ఫ్లాప్ అయితే నాగార్జున కెరీర్ ప్రమాదంలో పడినట్టేనని చెప్పవచ్చు.

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఒక సినిమాలో, కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో బంగార్రాజు సినిమాలో నాగార్జున నటిస్తుండగా బంగార్రాజు సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాల్సి ఉంది.

ఇప్పటికే బంగార్రాజు స్క్రిప్ట్ పనులు పూర్తైనా నాగార్జున మాత్రం ఈ సినిమాను వేగంగా పట్టాలెక్కించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube