వకీల్ సాబ్ మూవీ టార్గెట్ అన్ని కోట్లా..?

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో వకీల్ సాబ్ సినిమాకు కరోనా విజృంభిస్తున్నా రికార్డు స్థాయిలో టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి.రీమేక్ సినిమా కావడంతో ఈ సినిమాకు బడ్జెట్ తక్కువే అయినా పవన్ ఈ సినిమాకు 50 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారని తెలుస్తోంది.

 Vakeel Saab Movie Satellite Rights Details , 84 Crores ,pawan Kalyan, Pre Releas-TeluguStop.com

ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ హక్కులు 74 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

నైజాంలో వకీల్ సాబ్ హక్కులు ఏకంగా 23 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.

కోస్తాంధ్ర ఏరియాలో దాదాపు 40 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులు అమ్ముడైనట్లు సమాచారం.సీడెడ్ హక్కుల విషయానికి వస్తే 12 కోట్ల రూపాయలకు హక్కులు తీసుకున్నట్టు తెలుస్తోంది.

కర్ణాటక, ఓవర్సీస్ ఏరియాలను కలుపుకుంటే వకీల్ సాబ్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 84 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు అర్థమవుతోంది.

Telugu Pawan Kalyan, Pre, Vakeel Saab-Movie

సినిమాకు టాక్ ఎలా ఉన్నా సినిమా రిలీజైన మూడు రోజుల వరకు కలెక్షన్లకు ఢోకా లేదనే చెప్పాలి.మంచి టాక్ వస్తే మాత్రం వీక్ డేస్ లో కూడా వకీల్ సాబ్ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించే అవకాశం ఉంటుంది.కనీసం 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే ఈ సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

కరోనా పరిస్థితుల్లో 100 కోట్ల కలెక్షన్లు సాధించడం అంత తేలికైన పని కాదు.

వకీల్ సాబ్ సినిమా ఎంత మేర కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

వకీల్ సాబ్ రిజల్ట్ ను బట్టే తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఇతర సినిమాల దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.వకీల్ సాబ్ సినిమా రిలీజైన తర్వాత కొన్ని సినిమా రిలీజ్ డేట్స్ లో మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

వకీల్ సాబ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube