సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గా ఎన్.వి.రమణకి లైన్ క్లియర్ చేసిన రాష్ట్రపతి..!!

ప్రస్తుత దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న జస్టిస్ బొబ్డే ఈ నెల 23వ తేదీ రిటైర్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన స్థానం లోకి ఏప్రిల్ 24 వ తారీకు నుండి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ బాధ్యతలు చేపట్టనున్నారు.48వ సీజేగా జస్టిస్ ఎన్ వి రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బొబ్డే గతంలో కేంద్రానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో రాష్ట్రపతి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గా ఎన్.వి.రమణకి లైన్ క్లియర్ చేస్తూ ఆమోదముద్ర వేయడం జరిగింది.ఏప్రిల్ 24 వ తారీకు నుండి బాధ్యతలు చేపట్టనున్న ఎన్.వి.రమణ 26 ఆగస్టు  2022 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పొన్నవరం గ్రామానికి చెందిన ఈయన 1983 లో న్యాయవాద వృత్తి మొదలుపెట్టడం జరిగింది.

 Indian President Appointed Cj Ramana As Next Chief Justice Nv Ramana, Andhra Pra-TeluguStop.com

రెండువేల సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తూ 2014వ సంవత్సరంలో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందడం జరిగింది.

 కాగా దేశ అత్యున్నత న్యాయమూర్తిగా ఎన్.వి.రమణ నియమితులు కావటంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాకుండా సుప్రింకోర్టు చరిత్రలో ఛీప్ జస్టి స్ అయిన రెండో తెలుగు వ్యక్తిగా రమణ కీర్తి పేరు సంపాదించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube