తమిళనాడు రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..!!

దేశ వ్యాప్తంగా దాదాపు ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.తమిళనాడు, కేరళ, పాండిచేరి రాష్ట్రాలలో సింగిల్ ఫేజ్ ఎన్నికలు… జరుగుతుండగా బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో మూడో విడత అసెంబ్లీ పోలింగ్ జరుగుతుంది.

 Celebrities Who Exercised Their Right To Vote In The State Of Tamil Nadu State ,-TeluguStop.com

ఈ తరుణంలో తమిళనాడు రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి.గత ఎన్నికలలో అన్నాడీఎంకే పార్టీ 136 స్థానాలలో విజయం సాధించి అధికారం కైవసం చేసుకోగా డీఎంకే పార్టీ.98 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది.వరుసగా అన్నాడీఎంకే పార్టీ రెండు సార్లు గెలవడంతో… ఈసారి దాదాపు డీఎంకే పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రజినీకాంత్ ఈరోజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.చెన్నైలోని స్టెల్లా మేరీస్ కళాశాలలో రజినీకాంత్ ఓటు వేయడం జరిగింది.

ఇదే తరుణంలో డిఎంకె పార్టీ అధినేత స్టాలిన్ కుటుంబ సభ్యులతో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.చెన్నైలోని ఎస్ఐటి కాలేజీ పోలింగ్ బూతులో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అదేవిధంగా మక్కల్ నీది మయ్యన్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ చెన్నైలోని ఏల్దన్స్ రోడ్డు లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కూతుళ్లతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా చాలా మంది ప్రముఖులు సెలబ్రిటీలు మరియు వివిధ పార్టీల నేతలు.

ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తమిళనాడు రాష్ట్రంలో 236 అసెంబ్లీ స్థానాలకు 998 అభ్యర్థులు పోటీలో పాల్గొన్నారు.

కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.ఇదే తరహాలో పాండిచేరి రాష్ట్రంలో మొదటి దశ ఎన్నికలు జరుగుతుండగా.

అస్సాం, బెంగాల్ రాష్ట్రాలలో మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube