వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించని శృతి !

పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత రాబోతున్న వకీల్ సాబ్ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ వచ్చింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ఎప్పుడు చూద్దామా అన్నట్టు పవన్ ఫ్యాన్స్ తో పాటు అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 Shruti Haasan Ignores Vakeel Saab Promotions,  Vakeel Saab, Shruti Haasan, Pawan-TeluguStop.com

ఈ సినిమాకు ఇప్పటికే ప్రమోషన్స్ వీర లెవల్లో ఇస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది.ఈ సినిమాలో శృతి హాసన్ కీలక రోల్ చేస్తుంది.ఏప్రిల్ 9 న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇంతవరకు శృతి హాసన్ ఈ ప్రమోషన్స్ లో కనిపించలేదు.కీలక పాత్రల్లో నటిస్తున్న అంజలి, నివేతా థామస్, అనన్య ముగ్గురు ప్రమోషన్స్ చేస్తున్నారు.

కానీ శృతి మాత్రం ఎక్కడ కనిపించలేదు.

Telugu Pawan Kalyan, Shruti Haasan, Shrutihaasan, Vakeel Saab-Movie

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా శృతి కనిపించలేదు.అంతేకాదు ఈ ఈవెంట్ లో పవన్ అందరి గురించి మాట్లాడాడు కానీ శృతి పేరు మాత్రం పవన్ నోటా మాత్రమే కాదు ఎవ్వరి నోటా వినిపించలేదు.అంతేకాదు వకీల్ సాబ్ ట్రైలర్ లో కూడా శృతి హాసన్ కనపడలేదు.

ఈమె పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుందని ఈ పాత్ర రివీల్ అవ్వకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు.

ఇది ఇలా ఉండగా వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు.ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్నాడు.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.పవన్ శృతి ఇప్పటికే రెండు సినిమాల్లో కలిసి నటించారు.

ఇప్పుడు మూడవసారి జత కట్టారు.చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత ఆకట్టుకుంటుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube