ఒక్క సినిమాతోనే పత్తా లేకుండా పోయిన ఈ హీరోయిన్ గుర్తుందా..? 

తెలుగులో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన “ఈ అబ్బాయి చాలా మంచోడు” చిత్రం అప్పట్లో ఇటు కమర్షియల్ గా అటు మ్యూజికల్ గా మంచి హిట్ అయింది.కాగా ఈ చిత్రంలో హీరోయిన్లుగా వాణి, సంగీత తదితరులు నటించగా సనా, ప్రీతీ నిగం, బెనర్జీ, అజయ్ రత్నం, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

 Ee Abbai Chala Manchodu Movie Fame Vani Real Life And Movie Career News, Ee Abba-TeluguStop.com

అయితే ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించిన సంగీత ప్రస్తుతం టాలీవుడ్ లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి బాగానే రాణిస్తోంది.కాగా సంగీత ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “ఆచార్య” చిత్రంలోని ఓ రోల్ లో కనిపించనుంది.

ఇక రవితేజ విషయానికొస్తే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో  స్టార్ హీరోగా రాణిస్తూ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.

అయితే ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ పాత్రలో నటించిన వాణి మాత్రం పలు అనివార్య కారణాల వల్ల సినిమా పరిశ్రమకి దూరంగా ఉంటోంది.

అయితే వాణి వచ్చీరావడంతోనే మంచి హిట్ అందుకున్నప్పటికీ ఎందుకో సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది.

అయితే అప్పట్లో ఈ అమ్మడికి ఓ స్టార్ హీరో చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల వాణి హీరోయిన్ గా నటించ లేకపోయిందట.

దీనికితోడు అప్పుడే వాణి హీరోయిన్ గా కెరీర్ మొదలు సమయంలో అనుకోకుండా ఈమె హీరోయిన్ గా నటించిన రెండు చిత్రాలు మధ్యలోనే షూటింగ్ ఆగిపోయాయట.దీంతో ఈ ప్రభావం అమ్మడి సినిమా కెరియర్ పై పడిందని అప్పట్లో పలు కథనాలు వినిపించాయి.

అయితే ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రంలో నటించిన తర్వాత వాణి గురించి ఎలాంటి సినిమా సమాచారం లేదు.దీంతో ప్రస్తుతం ఆమె ఏం చేస్తుంది.? ఎక్కడ ఉంది.? ఎలా ఉంది.? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube