అమ్మ బాబోయ్ : గవర్నమెంట్ జాబ్ లేకపోతే పెళ్లవ్వడం కష్టమేనంట....

పూర్వకాలంలో యువకుడు లేదా యువతికి పెళ్లి చేయాలంటే వారికి తగ్గట్టుగా సరైన ఈడు జోడు చూసి పెళ్లి చేసేవాళ్ళు.ఈ క్రమంలో యువకుడు జీత భత్యాలు మరియు చేసేటువంటి ఉద్యోగం వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకునేవారు.

 Latest Survey About Marriage No Government Job There Is No Marriage, Government-TeluguStop.com

దీంతో వరుడికి ఇచ్చేటువంటి కట్నకానుకల విషయంలో కూడా వరుడు ఉద్యోగం, జీతభత్యాలు కీలక పాత్రను పోషిస్తాయి.

అయితే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి యువకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

ఇందులో కొంతమంది యువతి తల్లిదండ్రులు క్లర్క్ ఉద్యోగమైనా సరే ప్రభుత్వం ఉద్యోగం కలిగి ఉంటే లక్షలు రూపాయలు కట్నకానుకలుగా చదివించి తమ అల్లుడిని చేసుకోవడానికి అస్సలు వెనుకాడడం లేదు.

అయితే తాజాగా ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది తల్లిదండ్రులు తమకు కాబోయే అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడై వుండాలని కోరుకుంటున్నారట.

అయితే ఇందులో చదువుకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని,  ఎంతగా అంటే ఎంబీబీఎస్ చదువు చదివినప్పటికీ గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే అతడికి పిల్లను ఇవ్వడానికి వధువు తల్లిదండ్రులు సంకొచిస్తున్నారట.

అయితే వైద్య శాస్త్రంలో అత్యంత ఖర్చుతో కూడుకున్న విద్యలో ఎంబిబిఎస్ ఒకటి.

  ఈ కోర్సు చదవాలంటే దాదాపుగా కోటి రూపాయలకు పైగా వెచ్చించాల్సిందే.ఒకవేళ రిజర్వేషన్ కోటాలో సీటు గనుక వస్తే తక్కువలో తక్కువ దాదాపుగా 50 లక్షల రూపాయలకు పైగా వెచ్చించాల్సి ఉంటుంది.

అయితే  ఎంబిబిఎస్ చదివిన వాళ్లకే పెళ్లిళ్లు కావడం లేదంటే చిన్నచిన్న డిగ్రీలు అసలు చదువుకోనటువంటి యువకుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు.

దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది అంతేగాక ఈ విషయం గురించి కొందరు నెటిజన్లు స్పందిస్తూ ప్రపంచంలో కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రమే కాదని, డబ్బు సంపాదించడానికి ఇతర ఉద్యోగాలు కూడా చాలానే ఉన్నాయని ఈ విషయాన్ని వధువు లేదా వరుడి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక కొంతమంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి తమ పిల్లలకి గవర్నమెంటు ఉద్యోగం వస్తేనే జీవితం బాగుంటుందని నూరిపోస్తున్నారని ఇది సరికాదని తమ మనసుకు నచ్చిన పని ఎలాంటిదైనా సరే చేయడంలో తప్పు లేదని సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube