ముగ్గురు భామలతో చైతూ రొమాన్స్

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ మూవీ ‘థ్యాంక్ యు’ను ప్రారంభించాడు చైతూ.

 Naga Chaitanya To Romance Three Heroines, Naga Chaitanya, Heroines, Thank You, R-TeluguStop.com

ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.కాగా ఈ సినిమాలో చైతూ సరసన అందాల భామ రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

అయితే ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో అందాల భామలు మాళవికా నాయర్, అవికా గోర్‌లు కూడా నటించనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమాలో వీరిద్దరు కేమియో పాత్రల్లో నటిస్తారా లేక ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.ఏదేమైనా ముగ్గురు భామలతో రొమాన్స్ చేసేందుకు చైతూ రెడీ అవుతుండటంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

మరి ఈ సినిమా ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

అటు లవ్ స్టోరి చిత్రంతో అదిరిపోయే హిట్ కొట్టాలని చైతూ చూస్తున్నాడు.

ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలోని సారంగ దరియా పాట ఇప్పటికే ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే.

మరి లవ్ స్టోరి చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube