ఐటీ కంపెనీల చేతుల్లో అమెరికా రాజకీయం..వాళ్ళు చెప్పేదే వేదం..!!!

ప్రభుత్వాలను శాసించేది కేవలం కార్పోరేట్ బాబులే అన్న విషయం అందరికి తెలుసు.బడా బాబుల అండదండలు లేకపోతే రాజకీయ నాయకుల గెలుపు నిధులు హుష్ కాకే.

 America Politics In The Hand Of Big It Company's , Democratic Party, America, T-TeluguStop.com

ఇలాంటి పరిస్థితి ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు దాదాపు అన్ని దేశాలలో ఇదే వ్యవస్థ నడుస్తుంది.పై పై కి నాయకులు కనిపించినా వారిని నడిపించేది మాత్రం బడా బాబులే.

అగ్ర రాజ్యం అమెరికా కూడా ఇందుకు తీసిపోలేదు.డెమోక్రటిక్ పార్టీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది , భారీ స్థాయిలో నిధులు కుమ్మరించింది కేవలం కార్పోరేట్ శక్తులే నని పబ్లిక్ సిటిజన్ అనే సంస్థ నివేదిక వెల్లడించింది.

గతంలో అమెరికా రాజకీయాలని చమురు, పొగాకు లాబియిస్ట్ లు శాసించే వారు.కానీ ఇప్పుడు అమెరికా రాజకీయాలని శాసించేది మాత్రం బడా ఐటీ కంపెనీలు అని ఈ నివేదిక వెల్లడించింది.తాజాగా జరిగిన 2020 అధ్యక్ష ఎన్నికల్లో బడా ఐటీ కంపెనీలు దాదాపు 12.4 కోట్ల డాలర్లు ఖర్చు చేశాయట.ఎక్సాన్, ఫిలిప్, మారిస్ లు చేసిన ఖర్చు కంటే కూడా అమెజాన్, ఫేస్ బుక్ లు రెండు ఇంతలు భారీగా ఖర్చు చేశాయని నివేదికలో తెలిపింది.

అమెరికన్ కాంగ్రెస్ సభ్యులను ఆకట్టుకోవడానికి ఫేస్ బుక్ ఏకంగా 56 శాతం ఖర్చు పెట్టిందట.

అంతేకాదు తన లాబియింగ్ ద్వారా సుమారు 40 సభ్యుల మద్దతు సంపాదించుకుందట.అమెజాన్ ఫేస్ బుక్ ద్వారా దాదాపు 94 శాతం మంది కాంగ్రెస్ సభ్యులు ముడుపులు పుచ్చుకున్నారట.

ప్రభుత్వ ప్రజా నిర్ణయాలలో సైతం సదరు కంపెనీలు కల్పించుకునే స్థాయికి ఇప్పుడు అమెరికా రాజకీయాలు దిగజారిపోయాయని ఈ నివేదిక వెల్లడించింది.ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కేవలం బడా కార్పోరేట్ శక్తుల కనుసన్నల్లో పనిచేస్తున్నాయి కానీ ప్రజల కోసంపనిచేయడం అత్యంత తక్కువ అని తేల్చింది పబ్లిక్ సిటిజన్ సంస్థ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube