చిరంజీవి సినిమాలో జబర్దస్త్ కమెడియన్స్.. ఎవరంటే?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేయాలని సినీ బృందం విరామం లేకుండా ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

 Jabardasth Comedians Chammak Chandra And Getup Srinu In Acharya Movie , Jabardas-TeluguStop.com

ఇక ఈ సినిమా లో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.అంతే కాకుండా రామ్ చరణ్ ఈ సినిమాలో సిద్ధ అనే స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో నటిస్తున్నాడు.

నక్సలైట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ యూనియన్ లీడర్ నుండి నక్సలైట్ గా మారతాడు.ఇక రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు పూర్తికాగా మే 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో జబర్దస్త్ కమెడియన్స్ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Aacharya, Acharya, Chammak Chandra, Chiranjeevi, Getup Srinu, Kajal Agarw

అదేంటి నక్సలైట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కామెడీ ఉందా అనుకుంటున్నారా.అవును ఈ సినిమాలో కాస్త ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి కొన్ని సన్నివేశాలను చేస్తున్నారట.కామెడీతో కొన్ని సన్నివేశాలు ఉండగా.అందులో జబర్దస్త్ కమెడియన్స్ గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర నటిస్తున్నారట.అంతేకాకుండా వీరితో చిరంజీవి కూడా ఆడుకుంటాడని, కాజల్ తో వీరికి మంచి సీక్వెన్స్ ఉంటుందని వినిపిస్తున్నాయి.మొత్తానికి ఈ సినిమాలో కామెడీ ఉందని తెలిసిపోతుంది.

ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమా పాట విడుదల చేయగా అభిమానులకు బాగా ఆకట్టుకుంది.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ లను విడుదల చేయగా.

అందులో చిరంజీవి రామ్ చరణ్ కంటే యంగ్ గా కనిపించారు.ఈ సినిమాలో మణిశర్మ తన స్వరాన్ని వినిపిస్తున్నాడు.

ఈ సినిమా కోసం చిరంజీవి తెగ వర్కౌట్లు కూడా చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube