హాస్పిటల్ నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి... మూడు వారాలు విశ్రాంతి...?!

చెన్నై నగరంలోని అడయార్‌ లోని ఫోర్టీస్‌ మలర్‌ ఆస్పత్రిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాకు రెండు సర్జరీలు  నిర్వహించిన అందరికీ విధితమే.తాజాగా  ఎమ్మెల్యే రోజా మలర్‌ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు భర్త సెల్వమణి తెలియజేశారు.

 Nagiri Mla Roja Selvamani Discharged From Hospital , Mla Roja, 3 Weeks, Chennai,-TeluguStop.com

ఈ క్రమంలో డాక్టర్స్ సూచన మేరకు చెన్నై నగరం లోని తన స్వగృహంనే  మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.డిశ్చార్జ్ అనంతరం ఎమ్మెల్యే రోజా కొడుకు, కుటుంబ సభ్యులతో రోజా ఫోటోలు దిగారు.

రోజా దాదాపు వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు.

వాస్తవానికి రోజాకు సర్జరీలు గత ఏడాదే జరగాల్సింది.

కానీ, కరోనా వైరస్ కారణం చేత వాయిదా వేసినట్లు భర్త సెల్వమణి తెలియజేశారు.ఇటీవల సాధారణ పరీక్షల కోసం చెన్నై లోనే మలర్‌ హాస్పటల్లో వెళ్లగా వెంటనే వైద్యులు సర్జరీ చేయడం చాలా అవసరమని తెలపడంతో అప్పటికి కూడా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత చేయించుకుంటానని రోజా అడిగినప్పటికీ అది మంచి నిర్ణయం కాదని వైద్యులు తెలియజేసినట్లు సమాచారం.

దీనితో వెంటనే రోజా ఆసుపత్రిలో జాయిన్ అయి సర్జరీ  చేసుకున్నట్లు సమాచారం.ఇక సర్జరీ పూర్తయిన అనంతరం ఎమ్మెల్యే రోజాకు సీఎం వైఎస్ జగన్ ఫోన్ చేసి పరామర్శించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఆ సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని మరి, తిరుపతి ఉప ఎన్నిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రోజాను అవి  ఏమీ పట్టించుకోకుండా ప్రశాంతగా ఉండాలని, అలాగే  ప్రస్తుతానికి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు సీఎం జగన్.ఇక మరో వైపు ఎమ్మెల్యే రోజా పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని నగరి వైసీపీ నాయకులు అందరూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube