రోబో వేసిన పెయింటింగ్‌ ఎంత ధర పలికిందో తెలిస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే..?!

ప్రపంచంలోనే  పౌరసత్వం పొందిన మొట్టమొదటి ఫిమేల్ రోబోట్ ఏదైనా ఉంది అంటే అది రోబో సోఫియా అని అందరూ అంటారు.ఈ రోబోను హాంకాంగ్ కు చెందిన  హాన్సన్ రోబోటిక్స్ వారు అభివృద్ధి చేసిన సంగతి అందరికి విదితమే.

 Robot Painter Sells Piece For $688k, Robot Sophia, Robot Painter, Italian Artist-TeluguStop.com

ఈ ఫిమేల్ రోబోట్ ను  ఫిబ్రవరి 14 2016లో ఆవిష్కరణ చేశారు.ఈ  ఫిమేల్ రోబోట్ ను  మొట్టమొదటిసారిగా  ఆస్టిన్ సౌత్ వెస్ట్ ఫెస్టివల్‌లో ప్రజల ముందు ప్రవేశపెట్టారు.

రోబోట్ సోఫియా అచ్చం మనిషి వలే నాట్యం చేస్తుంది, పాటలు పాడుతుంది, అలాగే వింటుంది, ఆలోచిస్తుంది, మనిషితో మనిషిలానే మాట్లాడుతుంది .అంతే కాకుండా  ఈ రోబోకు సోఫియాకు ‘సోఫియా థీ రోబోట్’ అనే  పేరుతో ఒక ప్రత్యేకమైన ప్రొఫైల్ కూడా ఉండడం విశేషం.ఎప్పటి కప్పుడు ఈ రోబో సోఫియాకు సంబంధించిన అప్డేట్ అన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా తెలియ చేస్తూ ఉంటారు .


ఈ రోబోట్ ఇప్పటికే చాలా సమావేశాలలో అనేక సమావేశాలలో కనిపించి అనేక పత్రికా సమావేశాల్లో కూడా ప్రసంగించింది.  ఈ  ఫిమేల్  రోబోట్ ను సృష్టించిన డేవిడ్‌ హాన్సన్‌ మాట్లాడుతూ.ఈ రోబోను  ఉపయోగించడం వల్ల ప్రజలలో మమేకం అవుతుందని , అలాగే ఆసుపత్రులలో, ప్రముఖ పరిశ్రమలలో, ఇతర సంస్థలను ఇది ఎంతో సహాయపడుతుందని తెలిపాడు.ఈ తరుణంలో  రోబోట్ సోఫియా సృష్టించిన  ‘డిజిటల్‌ ఆర్ట్‌వర్క్‌’ వేలం పాటలో దాదాపు 6,88,888 డాలర్లు (రూ.5.5 కోట్లు) పలకడం ఒక్క సారిగా  అందర్నీ ఆశ్చర్యానికి చేస్తుంది.అలాగే ఇటీవల కాలంలోనే  రోబో సోఫియా సంగీత సాధన పై దృష్టి పెట్టినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube