వీడు మగాడ్రా బుజ్జి: ప్రపంచంలో మొదటి సారిగా మూడు పురుషాంగాలతో జన్మించిన బుడ్డోడు..!

ఏదైనా జన్యుపరమైన సమస్యలు తలెత్తినపుడు రెండు తలలు, రెండు కాళ్లు, రెండు చేతులతో పసి పిల్లలు జన్మిస్తుంటారు.ఇటువంటి ఘటనలు వైద్య చరిత్రలో ఎన్నో వెలుగుచూశాయి.

 A Boy In Iraq Born With Three Penis , A Boy, Born, Three Penises, Viral News, Vi-TeluguStop.com

కానీ తాజాగా ఒక మగబిడ్డ మూడు పురుషాంగాలతో జన్మించాడు.దీంతో వైద్యులు షాక్ అవుతున్నారు.

ఇప్పటివరకు ఏ మానవుడు కూడా మూడు పురుషాంగాలతో జన్మించ లేదని.వైద్య చరిత్రలో ఇది ఒక అద్భుతం అని డాక్టర్లు చెబుతున్నారు.

ఇంతకీ అదనపు అంగాలతో జన్మించిన ఆ మగ బిడ్డ ఎవరో? ఎక్కడ పుట్టాడో? ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఇరాక్ దేశంలోని ఉత్తరాన ఉన్న దుహోక్‌లో మూడు నెలల క్రితం ఒక మగ బిడ్డ జన్మించాడు.

అయితే కొద్ది రోజుల తర్వాత తల్లిదండ్రులకు ఆ మగ బిడ్డ బీజావయవము వద్ద అదనంగా ముడతలు పడిన శరీరం ఉన్నట్లు కనపడింది.దీంతో ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే పరీక్షలు చేసిన అనంతరం ఆ మగ బిడ్డ మూడు పురుషాంగాలతో పుట్టాడని తెలిసి డాక్టర్లు ఆశ్చర్య పోయారు.ఐతే ఈ జన్యు పరమైన సమస్యలను త్రిఫల్లియా అని వైద్యులు అంటున్నారు.

ఆరు మిలియన్ల ప్రజలలో కేవలం ఒకే ఒక్క మగ బిడ్డ రెండు అంగాలతో పుట్టే అవకాశం ఉంది కానీ ఇప్పటివరకు ఏ మానవుడు కూడా 3 పురుషాంగాల తో జన్మించలేదు.దీంతో వైద్య చరిత్రలోనే ఇదే మొట్టమొదటి కేసు గా డాక్టర్లు చెబుతున్నారు.

Telugu Boy, Baby Boy, Born, Boy Penis, Docters, Iraq, Iraq Baby Boy, Medical, Me

అయితే శిశువు యొక్క మూడు అంగాలలో కేవలం ఒక్క అంగం మాత్రమే పని చేస్తోందని వైద్యులు కనిపెట్టారు.అలాగే పని చేస్తున్న పురుషాంగానికి మాత్రమే తల ఉన్నట్టు వైద్యులు కనుగొన్నారు.దీంతో ఎక్స్ ట్రా గా ఉన్న మిగతా రెండు అంగాలను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.అయితే ఇటువంటి పరిస్థితుల వలన ప్రాణం పోయే అపాయాలు ఉండవు కానీ మూత్ర నాళం, జీర్ణాశయంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఏదేమైనా ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగానే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube