అలాంటి కేసులో పోలీసులకి చిక్కి కెరియర్ పగొట్టుకున్న అర్జున్ బ్రదర్....

తెలుగులో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన “కిక్” సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ తెలుగు నటుడు “శ్యామ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగా నటుడు శ్యామ్ తెలుగులో విలన్ ఓరియెంటెడ్ పాత్రలో మాత్రమే కాకుండా పలు పాజిటివ్ ఓరియెంటెడ్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను బాగానే అలరించాడు.

 Racegurram Movie Fame Shaam Arrest And Movie Career Collapsed News, Racegurram M-TeluguStop.com

ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన “రేసుగుర్రం” చిత్రంలో హీరో అన్నయ్య పాత్రలో నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు.

అయితే మొదటగా శ్యామ్ పలు తమిళ చిత్రాల ద్వారా నటుడిగా సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు.

కానీ ఇతడికి నటన పరంగా మంచి గుర్తింపు వచ్చింది మాత్రం తెలుగులోనే. అయితే సినిమా అవకాశాల పరంగా బిజీ బిజీ గా గడుపుతున్న సమయంలో అనుకోకుండా ఓ పోలీసు కేసులో ఇరుక్కుని చేజేతులారా తన సినీ కెరీర్ ని నాశనం చేసుకున్నాడు.

అయితే నటుడు శ్యామ్ కి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో ఓ క్లబ్ ఉంది.అయితే ఈ క్లబ్ లో పలు అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించి గత ఏడాది జూలై 28 వ తారీఖున శ్యామ్ ని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు.

అప్పటి నుంచి నటుడు శ్యామ్ సినిమా పరిశ్రమకి కొంత మేర దూరంగా ఉంటున్నాడు.అంతేకాకుండా పలు కేసులలో పోలీసులకు చిక్కిన శ్యామ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు.? ఏం చేస్తున్నాడు.? అనే విషయాలు గురించి ఇంకా తెలియాల్సి ఉంది.

ఏదేమైనప్పటికీ ఎంతో నటన ప్రతిభ ఉన్నటువంటి ఓ నటుడు ఇలా అనుకోకుండా వివాదంలో చిక్కుకొని అరెస్ట్ అవ్వడం తో సినిమా పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.అయితే నటుడు శ్యామ్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా 20 కి పైగా చిత్రాలలో విలన్ గా నటించాడు.

కానీ తెలుగులో నటించిన యాక్షన్ త్రీడీ, ఊసరవెల్లి, రేసుగుర్రం, కిక్2, కిక్, ఆక్సిజన్, తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమేగాక శ్యామ్ కి మంచి పేరు ప్రఖ్యాతలని తెచ్చి పెట్టాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube