రహదారుల నిర్మాణంలో గడిచిన ఆర్ధిక సంవత్సరం 2020-21లో భారత్ ప్రపంచ రికార్డ్ సాధించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2020 ఏప్రి నుండి 2021 మార్చి వరకు దేశం మొత్తం మీద 13,394 కిలోమీటర్ల రహదారులను నిర్మించిందని.
రోజుకి 37 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారని ఆయన చెప్పారు.అంతకుముందు రోజుకి 2 కిలోమీటర్ల సగటు మాత్రమే ఉండేదని మంత్రి చెప్పారు.
రహదారుల నిర్మాణంతో గిన్నిస్ బుక్ రికార్డ్ భారత్ నమోదు చేసిందని మంత్రి పేర్కొన్నారు.
ఢిల్లీ, వడోదర, ముంబై ఎనిమిది వరుసల ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్ట్ కూడా పూర్తయిందని.24 గంటల్లో 2.5 కిలోమీటర్ల నాలుగు వర్సల కాంక్రీట్ రోడ్డు పూర్తయిందని అన్నారు.24 గంటల్లో సోలాపూర్, బిజపూర్ మధ్య 25 కిలోమీటర్ల బిటుమెన్ రోడ్డుని కూడా నిర్మించడం జరిగిందని అన్నారు.రహదారుల నిర్మాణలో భారత్ ముందంజలో ఉందని నితిన్ గడ్కరీ అన్నారు.
రహదారుల నిర్మాణంలో ఫాస్ట్ ట్రాకింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టామని చెప్పారు.రానున్న ఐదు సంవత్సరాల్లో భారత మౌలిక రంగంలో గణనీయమైన మార్పు వస్తుందని.
పురోగతి కనబడుతుందని నితిన్ గడ్కరి అన్నారు.అమెరికా, యురోప్యన్ దేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా భారత్ రహదారులు ఉంటాయని ఆయన అన్నారు.