టెక్స్ టైల్ పార్కులో 12 వేల ఉద్యోగాలు..!

ఆరు నెలల్లో వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణం పూర్తవుతుందని తెలుస్తుంది.కొరియా దేశానికి చెందిన ప్రముఖ కంపెనీ యంగ్వాన్ ఈ నిర్మాణం చేపడుతుంది.

 Warangal Kakatitya Mega Textile Park 12 Thousand Jobs Ready Kakatitya Mega Texti-TeluguStop.com

మంత్రులు కే.టీ.ఆర్, ఎరబెల్లి దయాకర్ రావు పరిశ్రమలశాఖ ఉన్నత అధికారులంతా యంగ్వాన్ కంపెనీ చైర్మన్ సుంగ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ముందు ప్రకటించిన విధంగా పెట్టుబడి ప్రణాళిక అంతా సవ్యంగా కొనసాగుతుందని ఆయన అన్నారు.

రానున్న ఆరు నెలల్లో ఐదు ఫ్యాక్టరీల టెక్స్ టైల్ పార్క్ రెడీ అవుతుందని చెప్పారు.

ఈ టెక్స్ టైల్ పార్క్ పూర్తయితే కేవలం తెలంగాణాకే కాకుండా భారతదేశ టెక్స్ టైల్ రంగానికే ఇదొక మైలు రాయిగా నిలుస్తుందని మంత్రి కే.

టీ.ఆర్ అన్నారు.ఆరు నెలల తర్వాత ప్రపంచానికి మేడిన్ తెలంగాణా వస్త్రాలు కాకతీయ టెక్స్ టైల్ పార్క్ ద్వారా అందుతాయని చెప్పారు.ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం తరపున తాము అందించేందుకు సిద్ధమని కె.టి.ఆర్ అన్నారు.యంగ్వాన్ కంపెనీ ఏర్పాటు చేసే ఈ టెక్స్ టైల్ పార్క్ కు అవసరమైన విధంగా వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు పరిశ్రమ శాఖ సిద్ధంగా ఉందని అన్నారు.ఫ్యాక్టరీ పూర్తయిన తర్వాత సుమారు 12 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి దొరుతుందని తెలిపారు.

అంతేకాదు కంపెనీలో అత్యధికంగా మహిళలకే ఉద్యోగాలు దక్కుతాయని కూడా చెప్పారు.జిలా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 2, 3 నెలల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube