బాబు చేసిన సరిదిద్దుకోలేని తప్పులు ఇవేనట ! సోషల్ మీడియాలో వైరల్

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో తెలుగుదేశం పార్టీపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.ఇప్పటికే చంద్రబాబు సరిదిద్దుకో లేని ఎన్నో తప్పులు చేశారని,  అసలు బాబు ఈ తప్పిదాలు చేయడం కారణంగానే జగన్ కు ఈ స్థాయిలో క్రేజ్ వచ్చి , అధికారాన్ని దక్కించుకుని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉనికికే ప్రమాదం కలిగించే స్థాయిలో బలం పెంచుకున్నారని ఎన్నో విశ్లేషణలు వస్తున్నాయి.ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత చంద్రబాబు చేసిన కొన్ని తప్పిదాల కారణంగానే ఈ పరిస్థితి దాపురించింది అంటూ సోషల్ మీడియాలో టిడిపి అధినేత చంద్రబాబుపై ట్రోల్స్ నడుస్తున్నాయి.

 Chandrababu Naidu Mistakes Viral In Social Media , Ysrcp, Social Media, Ap Cm Ja-TeluguStop.com

  1.జగనన్న మీదకి కాంగ్రెస్ ను ఎగదోసి బయటకు వచ్చేలా చేసి ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు కారణమవడం.
  2.రాష్ట్ర విభజనకు రెండుసార్లు లేఖలు ఇవ్వడం విడిపోవడానికి కారణం అవ్వడం.
  3.జగనన్న మీద తప్పుడు కేసులు వేయించి వేధించడం.
  4.2014లో మోడీ పవన్ గడ్డం పట్టుకుని సచ్చి చెడి గెలిచాక అమరావతిని రాజధానిగా చేయడం, ప్రపంచ రాజధాని అంటూ గ్రాఫిక్స్ చూపించడం.
  5.23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా ప్రజాస్వామికంగా కొనడం, అసెంబ్లీ లో జగన్ అన్న మీద విచక్షణ లేకుండా బూతు తిట్లతో విరుచుకుపడడం, అవహేళన చేయడం, అవమానించడం, పరోక్షంగా జగనన్న అసెంబ్లీ వదిలి పాద యాత్రకు బయలుదేరేలా చేయడం, హోదా వద్దు అని ఒకసారి కావాలని ఒకసారి తన రాజకీయ అవసరాలను బట్టి నాలుక మడత పెటడం.

Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan, Mptc Zptc, Telugudesam, Trollschandra, Y

  6.చివర్లో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ మీద కి నెట్టేసి విడిపోవడం.
  7.తెలంగాణలో కాంగ్రెస్ పంచన చేరడం, ఆంధ్ర లో కాంగ్రెస్ తో నై అనడం.
  8.జగనన్న గెలిచాక ఓటమిని అంగీకరించి ఆత్మపరిశీలన చేసుకోకుండా కుల మీడియా ను ఉసిగొల్పడం, పిచ్చి రాతలు,  పైశాచిక ప్రచారం చేయడం.
  9.అమరావతి అమరావతి అంటూ నాలుగు ఐదు గ్రామాలకు పరిమితమవడం, కుల చట్రంలో కూరుకుపోవడం.

Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan, Mptc Zptc, Telugudesam, Trollschandra, Y

  10.2020 మార్చి 15 న రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు ఉన్నప్పుడు ఓటమి భయంతో నిమ్మగడ్డ చౌదరి కి చెప్పి ఎన్నికలు వాయిదా వేయకుండా ఉంటే టిడిపి ఇంత ఘోరంగా ఓడిపోయేది కాదు.ఎందుకంటే కరోనా విపత్కర సమయంలో జగనన్న పాలనను అందరూ మెచ్చుకున్నారు.నిజమైన నాయకత్వ పటిమ కరోనా సమయంలో బయటపడింది.
  11.నిమ్మగడ్డ ను అడ్డదిడ్డంగా వాడుకుని బాబు కూడా గబ్బు పట్టాడు.
  12.ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయను అని తప్పించుకోవడం.
    ఇలా ఎన్నెన్నో ట్రోల్స్ టిడిపి పై ఇప్పుడు నడుస్తున్నాయి.

బాబు వైఖరిని వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారులు ఇప్పుడు మరింత వైరల్ చేస్తున్నారు.             

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube