మూడు వారాల పాటు లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది ఆ దేశం..!!

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఉదృతంగా విస్తరిస్తూ ఉంది.తన రూపాన్ని మార్చుకుంటూ మరింత ప్రమాదకరంగా మనిషి జీవితంపై దాడి చేస్తూ ఉంది.

 In France Three Weeks Lock Down France, Emmanuel Macron,lock Down, Corona Virus,-TeluguStop.com

దీంతో వ్యాక్సిన్లు వచ్చినా గానీ ప్రస్తుత పరిస్థితిని అదుపు చేయడం చాలా కష్టమైన పని అనే టాక్ వైద్యుల నుండి వినపడుతూ ఉంది.మరోపక్క కరోనా నిబంధనలను పెద్దగా పట్టించుకోకుండా విచ్చలవిడిగా ప్రజలు తిరుగుతూ ఉండటంతో భయంకరంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.

అమెరికా మరియు యూరప్ దేశాలు కరోనా ధాటికి వణికిపోతున్నాయి.పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉంటే ఫ్రాన్స్ దేశంలో కరోనా థర్డ్ వేవ్ రావటంతో అక్కడ మూడో సారి లాక్ డౌన్ విధించారు.

గతంలోనే రెండుసార్లు ఫ్రాన్స్ దేశం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది.మళ్లీ ఇప్పుడు వెళ్లిపోవడంతో ఈ వార్త అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది.ఫ్రాన్స్ దేశంలో కరోనా వైరస్ భారీ స్థాయిలో విజృంభిస్తోంది.రోగులతో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి.

కొత్త రోగులను ఆసుపత్రిలో జాయిన్ చేసుకునే పరిస్థితి కూడా లేకపోవటంతో .దేశం ఆర్థికంగా నష్టాలు పాలు అయ్యే పరిస్థితి ఉన్న ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని మూడు వారాల పాటు లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రోన్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube