పీకలదాకా విస్కీ తాగి ఆ సినిమాలో యాక్ట్ చేశా అంటున్న హీరో

రోజాపూలు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత ఒకరికి ఒకరు సినిమాతో హిట్ కొట్టిన నటుడు శ్రీరామ్.అయితే ఈ టాలెంటెడ్ యాక్టర్ తెలుగు హీరో అయినా ఇక్కడ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో కోలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ కంటెంట్ బేస్ కథలతో హిట్స్ కొట్టాడు.

 Actor Sri Ram Took Drink And Act In Y Movie, Tollywood, Rahul Ramakrishna, Aha A-TeluguStop.com

కొంతకాలం పాటు హీరోగా తమిళ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నాడు.అయితే హీరోగా అతని జర్నీ ఎక్కువ కాలం కొనసాగలేదు.

దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ, తెలుగు, తమిళ్ బాషలలో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు.పెద్ద హీరోల సినిమాలలో మంచి పాత్రలు చేస్తూ అవకాశాలు పెంచుకుంటున్నాడు.

చాలా గ్యాప్ తర్వాత మరల శ్రీరామ్ పూర్తి స్థాయి పాత్రలో వై అనే సినిమా తెరకెక్కింది.ఈ సినిమా త్వరలో ఆహా ఒటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.ట్రైలర్ బట్టి చూస్తే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉన్నట్లుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా శ్రీ రామ్ సినిమా షూటింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Telugu Sri Ram, Actors Sri Rama, Aha App, Tollywood-Movie

నా జీవితంలోనే అతి తక్కువ సమయంలో చేసిన సినిమా ఇదే.రాహుల్ రామకృష్ణతో చేసిన ఆ సీన్‌లో ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది.ఏమేమో జరిగిపోయింది.

పీకలదాక విస్కీ తాగించి మా డైరెక్టర్ ఏదేదో చేయించాడు.ఆయన ఓ టాస్క్‌ మాస్టర్‌.

ఏమాత్రం హద్దు దాటకుండా చాలా నీట్‌గా తీసిన చిత్రమిది.ఇలాంటి సినిమాలో పనిచేయడం సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube