డైరెక్టర్ శంకర్ విషయంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన నిర్మాతలు..!!

సౌత్ ఇండియా టాప్ మోస్ట్ డైరెక్టర్ శంకర్ తీసే సినిమాలు ఏ రేంజ్ లో ఆడతాయి అనేది అందరికీ తెలుసు.శంకర్ సినిమా రిలీజవుతుందంటే సౌత్ ఇండియా మాత్రమే కాక బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆడియన్స్ కూడా ఎంతగానో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.

 Lyca Productions Petition In Madras High Court Against Director Shankar , Madras-TeluguStop.com

ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మాణ విలువల్లో తెరకెక్కించే శంకర్ భారీగానే ఖర్చు పెడుతూ ఉంటారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ భారతీయుడు సినిమా సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

లైకా నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా.షూటింగ్ గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది.

మధ్యలో అనేక ఆటంకాలు ఏర్పడటంతో వాయిదా పడుతూ వస్తున్న కాని తాజాగా సినిమాకి సంబంధించిన బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయిపోవడంతో డైరెక్టర్ శంకర్ విషయంలో నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం  అయిపోవడం జరిగిందని, ఇంకా బ్యాలెన్స్ ఉన్న 20 శాతం షూటింగ్ కోసం అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయిస్తున్నట్లు హైకోర్టులో పిటిషన్ వేశారు.

Telugu Bharateeyudu, Budget, Kajal Agarwal, Kamal Haasan, Kamal Hassan, Lyca, Ma

సినిమాకి మొదటిలో 180 కోట్ల బడ్జెట్ అని చెప్పి, ఇప్పటివరకు 236 కోట్ల రూపాయలు ఖర్చు చేయించినట్లు స్పష్టం చేశారు.అంతే కాకుండా ఈ సినిమా పూర్తి కాకుండా మరో సినిమా శంకర్ చేయకూడదు అని పిటిషన్ లో కోర్ట్ ని కోరారు.మరి మద్రాస్ హైకోర్టు డైరెక్టర్ శంకర్ పై ఏ విధమైన యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.కమల్ హాసన్ నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన మొదటి భారతీయుడు సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలుసు.ఆ సినిమాకి సీక్వెల్ గా… ఈ సినిమా వస్తున్న నేపథ్యంలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube