ఏపీ నూతన ఎస్ఈసీ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని..!! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని ఈరోజు ఉదయం బాధ్యతలు చేపట్టాడు.నిన్నటి వరకు ఎస్ఈసీ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగియడంతో .

 New Andhra Pradesh State Election Commission Neelam Sahni Took Charge , Nimmagad-TeluguStop.com

విజయవాడలోని ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో నీలం సాహ్ని కొద్దిసేపటి క్రితం చేరుకుని పదవీ బాధ్యతలను స్వీకరించారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తనని ఎస్ఈసీ గా నియమించిన రాష్ట్ర గవర్నర్  బిశ్వ భూషణ్ హరిచందన్ కు ధన్యవాదాలు అని తెలిపారు.

రాష్ట్రంలో త్వరలో జరగబోయే పరిషత్ ఎన్నికలలో ప్రభుత్వ యంత్రాంగం మరియు ప్రజల సహకారంతో కలిసి పని చేస్తామని నీలం సాహ్ని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలి మహిళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని గుర్తింపుపొందారు.

ఈ నేపథ్యంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్ఈసీ నీలం సాహ్నికి కమీషన్ కార్యదర్శి కన్నబాబు, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటి ఎన్నికల కమిషనర్ గా చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ.

ఎన్నికయ్యారు.నిన్నటితో ఆయన పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో నీలం సాహ్ని ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube