తిరుపతి ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి పై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు..!!

తిరుపతి ఉప ఎన్నికలలో బిజెపి పార్టీ తరఫున మాజీ ఐఏఎస్ రత్నప్రభ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల నామినేషన్ వేసిన ఆమె ప్రచారంలో బిజీబిజీగా గడుపుతోంది.

 Complaint Against Bjp Candidate Ratnaprabha For Tirupati By Election To Returnin-TeluguStop.com

ఇలాంటి తరుణంలో ఆమెపై పెండింగ్ కేసులు అదేవిధంగా కుల ధ్రువీకరణ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆమెపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది.పూర్తి విషయంలోకి వెళితే జనతాదళ్ పార్టీకి చెందిన నాయకులు రత్నప్రభ పై 5 పెండింగ్ కేసులు ఉన్నాయి అంటూ కంప్లైంట్ ఇచ్చారు.

నామినేషన్ లో తనపై ఏ కేసు లేదని రత్నప్రభ ఇచ్చిన అఫిడవిట్ రద్దు చేయాలని జనతాదళ్ యు నేత డిమాండ్ చేశారు.

రత్నప్రభ పై బంజారా హిల్స్ ఇంకా మరికొన్ని ప్రాంతాలలో కేసులో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు తెలియజేశారు.

వాటికి సంబంధించిన ఆధారాలు కూడా జతపరిచి ఫిర్యాదు చేశారు.అదేవిధంగా రత్నప్రభ కుల ధ్రువీకరణ పత్రాలకు రికార్డులు లేవని.తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆమె నామినేషన్లు తిరస్కరించాలని కోరారు.ఆమె భర్త క్రిస్టియన్ అని…అత్తింటి వారు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు అందువల్ల.

ఆమె బిసి-సి కిందకు వస్తారని, అలాంటప్పుడు ఎస్సీ రిజర్వు పార్లమెంట్ పరిధిలో ఆమె పోటీ ఎలా చేస్తారు అంటూ రత్నప్రభ పై జనతాదళ్ యు నేతలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube