వకీల్ సాబ్ ట్రైలర్ దెబ్బకు టీజర్‌పై పడ్డ ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ వేసవి కానుకగా రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌ను ఏ విధంగా దడదడలాడించిందో మనకు తెలిసిందే.

 Fans Now Target Vakeel Saab Teaser, Vakeel Saab, Pawan Kalyan, Vakeel Saab Trail-TeluguStop.com

మూడేళ్ల తరువాత పవన్ బొమ్మ వెండితెరపై మెరవనుండటంతో పవన్ ఫ్యాన్స్ సంతోషానికి ఆకాశమే హద్దుగా మారింది.ఇక ఈ సినిమాతో పవన్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా అంటున్నారు.

కాగా 1 మిలియన్ వ్యూస్ సాధించిన ఫస్ట్ ఎవర్ ట్రైలర్‌గా వకీల్ సాబ్ ట్రైలర్ నిలిచింది.దీంతో ఈ సినిమా టీజర్‌ను ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు.

ఇప్పటికే 9 లక్షల లైక్స్ సాధించిన వకీల్ సాబ్ టీజర్‌కు 1 మిలియన్ లైక్స్ తెచ్చే పనిలో పవన్ ఫ్యాన్స్ ఉన్నారట.ఈ విధంగా పవన్ కళ్యాణ్ పేరిట రెండు 1 మిలియన్ రికార్డులు నెలకొల్పాలని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

దీంతో ఇప్పుడు పవన్ అభిమానులు వకీల్ సాబ్ టీజర్‌ను మరింత ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారట.ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తుండటంతో వకీల్ సాబ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండగా, నివేదా థామస్, అంజలి, అనన్యాలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.అందాల భామ శృతి హాసన్ ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ఓ కేమియో రోల్‌లో నటిస్తోంది.

దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.మరి వకీల్ సాబ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube